మండల ఆఫీసులలో ఉద్యోగాలు భర్తీ | 10th Pass Govt Jobs | telugujobalerts24

మండల ఆఫీసులలో ఉద్యోగాలు భర్తీ :

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను జిల్లాల వారీగా విడుదల చేస్తూ వస్తుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట మరియు ఇచ్చాపురం మండలాలలో ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వివాహితులైన మహిళా అభ్యర్థులకు చాలా మంచి అవకాశం. సొంత ఊరిలో ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే మంచి అవకాశం, అదీను ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆఫ్ లైన్ లైన్ నందు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్, శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట మరియు ఇచ్చాపురం మండల పరిధి నందు గల వివిధ ప్రాంతాలలో విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

10th Pass Govt Jobs

సంస్థ పేరు :
స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ, శ్రీకాకుళం
పోస్టులు : ఈ నోటిఫికేషన్ ద్వారా శ్రీకాకుళం జిల్లాలోని వివిధ మండలాల వారీగా అంగన్వాడీ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
1. ఇచ్చాపురం : క్యాటగిరీలవారీగా గమనించినట్లైతే ఇచ్చాపురం అర్బన్ పరిధిలోని రధం వీధి ( యస్సి ), చిన్నకుల వీధి ( ఓసి ), చాకలి వీధి ( బిసి – బి ), బెల్లుపడ కొండ వీధి ( విహెచ్ ), చిన్నమెదర వీధి ( ఎస్టీ ), కాశివేసివేశ్వర వీధి ( యస్సి ) వారికి కేటాయించారు.
2. సోంపేట : మండలంలోని గ్రామాల వారీగా గమనించినట్లైతే బెంకిలి, ఇస్కలపాలెం, మామిడిపల్లి, పట్టణంలోని సోమేశ్వరమందిరవీది, పలాసపురం, గొనకపాడు, నిరిమామిడి, లక్ష్మీపు రం, పాలవలస, తాళ్లభద్ర లలో ఖాళీలు కలవు.

అర్హతలు :

1. విద్యార్హత :
• అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తేర్ణులై ఉండాలి.
• అభ్యర్థులు తప్పనిసరిగా వివిహతురాలై ఉండాలి.
అభ్యర్థులు తప్పనిసరిగా సొంత గ్రామం లేదా సొంత ప్రాంతం అనగా స్థానికురాలై ఉండాలి.
2. వయస్సు :
దరఖాస్తు దారులు 21 – 35 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి.
SC | ST వారికి 5 సంవత్సరాలు, BC వారికి 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పిస్తారు.

జీతం :
ఈ నోటిఫికేషన్ ద్వారా అంగన్వాడీ పోస్టులకు ఎంపికయినట్లైతే స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ వారి ఉత్తర్వుల ప్రకారం క్రింది విధంగా వేతనం అందుకుంటారు.
అంగన్వాడీ కార్యకర్త – రూ 11,500/-
మినీ అంగన్వాడీ కార్యకర్తలు – రూ 7,500/-
అంగన్వాడీ సహాయకురాలు – రూ 7,500/-

దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
• అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
• అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ మరియు తగు అర్హతల పత్రాలను సంబంధిత ప్రాజెక్టు అధికారికి చేరవేయండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజు :
జనరల్ అభ్యర్థులు కానీ మరియు మిగితా అభ్యర్థులు కానీ, ఎవ్వరూ కూడా ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ – నవంబర్ 28, 2020
దరఖాస్తు ఆఖరు తేదీ – డిసెంబర్ 05, 2020

ఎంపిక విధానము :
అభ్యర్థుల ఎంపిక, ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది.

ముఖ్యమైన లింకులు : నోటిఫికేషన్లోని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకుల పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.
అధికారిక వెబ్సైట్ : క్లిక్ హియర్
నోటిఫికేషన్ : క్లిక్ హియర్
అప్లికేషన్ పత్రము : క్లిక్ హియర్


6 thoughts on “మండల ఆఫీసులలో ఉద్యోగాలు భర్తీ | 10th Pass Govt Jobs | telugujobalerts24”

Leave a Comment