AP Govt Watchmen Jobs 2023 :
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత పాఠశాలల్లో నైట్ వాచ్‌మెన్ పోస్టుల నియామకానికి ఉత్తర్వులు జారీ చేసింది. దీనిలో భాగంగా 5,388 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల ఎంపిక 01వ తేదీ నాటికి పూర్తై విధులలో చేరవలసిందిగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పోస్టులకు ఎంపికైనట్లైయితే రూ 6,000ల గౌరవ వేతనాన్ని అభ్యర్థులు పొందుతారు.
Night Watchmen Jobs in AP High Schools 2023 :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం, రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల అభివృద్ధి కోసం మన బడి నాడు – నేడు పథకాన్ని తీసుకొచ్చిన సంగతి అందరికీ తెలిసినటువంటిదే. మరి ఈ పథకం కింద పాఠశాలల్లో నీళ్ల సదుపాయం, మరుగుదొడ్లు, తాగునీటి సరఫరా, తరగతి గదుల్లో ఫ్యాన్లు, ట్యూబ్ లైట్ల ఏర్పాటు, విద్యార్థులు మరియు సిబ్బందికి ఫర్నిచర్ ఏర్పాటు, గ్రీన్ చాక్ బోర్డు, పెయింటింగ్, ఇంగ్లిష్ ల్యాబులు, స్కూల్ కాంపౌండ్ వాల్, కిచెన్ షెడ్‌లు, అదనపు తరగతి గదులు ఏర్పాటు చేసింది. మరుగుదొడ్ల నిర్వహణ నిధి పథకం కింద అన్ని పాఠశాలలకు పారిశుద్ధ్య కార్మికుల ఆయాలను నియమించడమే కాకుండా క్లీనింగ్ కెమికల్స్, క్లీనింగ్ టూల్స్, ఇంటరాక్టివ్ ప్యానెల్‌లు, స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేశారు. అలాగే విద్యార్థులకు ట్యాబ్‌లు కూడా అందజేశారు.
AP High Schools Night Watchmen Jobs 2023
కొన్ని పాఠశాలల్లో దొంగతనాలు జరుగుతున్నాయని అనగా నాడు – నేడు కింద అందించిన పాఠశాలల్లోని విలువైన వస్తువులు చోరీకి గురవుతున్నాయని ఫిర్యాదులు ప్రభుత్వానికి అందడం జరిగింది. పాఠశాలలోని విలువైన వస్తువుల పరిరక్షణకు ప్రభుత్వం నైట్ వాచ్‌మెన్ పోస్టుల నియామించమని నోటిఫికేషన్ విడుదల చేసింది.
AP Govt High Schools Night Watchmen Jobs 2023 Notification :
- నాడు,నేడు పథకంలో భాగంగా కింద పాఠశాలల్లో ఇప్పటికే అయాలుగా పనిచేస్తున్న మహిళల భర్తకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు.
- గ్రామ లేదా వార్డులో మాజీ సేవా పురుషులకు రెండో ప్రాధాన్యత ఇస్తారు.
- ఈ రెండు విభాగాలకు సంబంధించినవారు లేనిపక్షలో పేరెంట్స్ కమిటీ సూచనల మేరకు అర్హత గల వ్యక్తిని నియమించుకునే అవకాశం ఉంటుంది.
- పోస్టుల నియామకంలో స్కూల్ ఎడ్యుకేషన్ కమీషనర్, మిడ్ డే మీల్స్ డైరెక్టర్ తదుపరి అవసరమైన చర్యలను తీసుకుంటారు.