ఆంధ్రప్రదేశ్ హై కోర్టులో ఉద్యోగాలు భర్తీ | AP High Court Recruitment

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగాలు భర్తీ :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం హై కోర్టులో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా జూనియర్ డివిజన్ క్యాటగిరిలో సివిల్ జడ్జీ పోస్టులను భర్తీ చేయనున్నారు. మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 68 పోస్టులలో 13 పోస్టులను బదిలీల ద్వారా, మిగితా పోస్టులను రాతపరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. సొంత రాష్ట్రంలోనే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో ఒక ఉద్యోగాన్ని పొందే మంచి అవకాశం. రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ హై కోర్టు నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

AP High Court Recruitment

సంస్థ పేరు :
హై కోర్టు, ఆంధ్రప్రదేశ్
పోస్టులు : ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ హై కోర్టులో జూనియర్ డివిజన్ క్యాటగిరిలో క్రింది పోస్టులను భర్తీ చేయనున్నారు.
సివిల్ జడ్జి – 68 పోస్టులు

అర్హతలు :

విద్యార్హత : రాష్ట్ర న్యాస్థానం నుండి విడుదలైన సివిల్ జడ్జి ఉద్యోగాలకు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు క్రింది విద్యార్హతలు కలిగి ఉండాలి.
• తప్పనిసరిగా అభ్యర్థులు లా విభాగంలో పట్టభద్రులై ఉండాలి.
• కనీసం మూడు అద్వకేట్ గా పనిచేస్తున్న అనుభవం కలిగి ఉండాలి.
వయస్సు :
దరఖాస్తు దారులు 18 – 35 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి.
SC | ST వారికి 5 సంవత్సరాలు, BC వారికి 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పిస్తారు.
జీతం :
ఆంధ్రప్రదేశ్ న్యాయస్థానం యొక్క ఉత్తర్వుల ప్రకారం ఏమపికయ్యేటువంటి అభ్యర్థులకు రూ 27,000/- ల వేతనం లభిస్తుంది.

దరఖాస్తు విధానం : ఆన్ లైన్
• అభ్యర్థులు ఆన్‌లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజు :
జనరల్ అభ్యర్థులు – రూ 800/- లు
మిగితా అభ్యర్థులు – రూ 400/- లు చెల్లించాలి.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ – డిసెంబర్ 04, 2020
దరఖాస్తు ఆఖరు తేదీ – జనవరి 02, 2021

ఎంపిక విధానము :
ఆన్ లైన్ స్క్రీనింగ్ టెస్ట్, రాతపరీక్ష మరియు వైవ నిర్వహించడం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ కంప్యూటర్ స్క్రీనింగ్ టెస్ట్, వైవా పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం మరియు సిలబస్ కొరకు క్రింది ముఖ్యమైన లింకుల విభాగంలోని నోటిఫికేషన్ నందు పొందుపరుస్తాను, డౌన్లోడ్ చేసుకొని గమనించగలరు.
ముఖ్యమైన లింకులు : ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్ క్లిక్ హియర్
అధికారిక వెబ్సైట్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై క్లిక్ హియర్
AP High Court Latest notification

Leave a Comment