Forest Department IPIRTI Recruitment :
కేంద్ర అటవీ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ ప్లైవుడ్ పరిశ్రమలు మరియు శిక్షణా సంస్థ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా డ్రైవర్,మల్టిటాస్కింగ్ స్టాఫ్,కార్పెంటర్, ల్యాబొరేటరీ అటెండెంట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచిచ్చు. రాతపరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది, కాబట్టి ప్రతిఒక్కరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోండి. ఈ ఉద్యోగాన్ని పొందినట్లైతే అభ్యర్థులు ప్లైవుడ్ పరిశ్రమల శాఖ కర్ణాటక నందు విధినిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ పేరు :
ఇండియన్ ప్లైవుడ్ పరిశ్రమలు మరియు శిక్షణా సంస్థ
పోస్టులు మరియు విద్యార్హతలు :
పోస్టు పేరు | అర్హత |
డ్రైవర్ | 10వ తరగతి మరియు డ్రైవింగ్ లైసెన్స్ |
యంటియస్ | 10వ తరగతి |
కార్పెంటర్ | 10వ తరగతి మరియు ఐటీఐ |
ల్యాబొరేటరీ అసిస్టెంట్ | 10th మరియు ఐటీఐ |
వయస్సు :
18 – 28 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
SC / ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పిస్తారు.
జీతం :
ఐపిఐఆర్టిఐ నోటిఫికేషన్ ద్వారా అభ్యర్థులు ఎంపికయినట్లైతే ఆ సంస్థ వారి ప్రకారం రూ 19,900 నుండి 34,400 వరకు వేతనం పొందుతారు.
దరఖాస్తు సమాచారం :
విధానం :
> అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
> అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
> అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
> అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
> అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను ‘ Director, Indian Plywood Industries Research & Training Institute (IPIRTI), Post Bag No. 2273, off. Tumkur Road, HMT Link Road, Bengaluru-560 022, Karnataka’ అనే చిరునామా కు చేరవేయండి.
> భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి
దరఖాస్తు ఫీజు :
జనరల్ అభ్యర్థులు – రూ 300/-
మిగితా అభ్యర్థులు – రూ 100/- చెల్లించాలి
ఎంపిక విధానము :
అభ్యర్థుల ఎంపిక, రాతపరీక్ష లేదా ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. ఈ టెస్టులకు సంబంధించిన పూర్తి సమాచారం మరియు సిలబస్ కొరకు క్రింది ముఖ్యమైన లింకుల విభాగంలోని నోటిఫికేషన్ నందు అలానే వీడియో నందు పొందుపరుస్తాను, డౌన్లోడ్ చేసుకొని మరియు వీక్షించగలరు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు చివరి తేదీ – 25/01/2021
ముఖ్యమైన లింకులు : ప్రకటనలోని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకుల పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.
నోటిఫికేషన్ : క్లిక్ హియర్
అప్లికేషన్ ఫార్మ్ : క్లిక్ హియర్
సూచన : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అభ్యర్థులు మీ జిల్లాలో ఉద్యోగ సమాచారాన్ని మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందలనుకుంటున్నారా, అయితే మీ జిల్లా పేరు ను కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇక ఆ బాధ్యత మేము తీసుకొని నోటిఫికేషన్ విడుదలైన వెంటనే మీకు తెలియజేస్తాము. కొంత కాల వ్యవధిలో ఉద్యోగ ఖాళీలను మాత్రమే అందిస్తాము.
Nirmal district
Ha tappakunda teliyajestanamdi
Kurnool
తప్పకుండా తెలియజేస్తానంది.
Kurnool
Apply chesukovachu meeru kuda chesukondi