పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగాలు భర్తీ | APGV | APCFSS Recruitment 2020

10వ తరగతితో సొంత గ్రామం లో ఉద్యోగాలు :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం, పంచాయతీ రాజ్ శాఖ ఖాళీగా ఉన్నటువంటి గ్రామ వార్డు వాలంటీర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దేశంలోనే అందరికి మోడల్ గా నిలిచిన గ్రామ వార్డు వాలంటీర్ వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొకసారి భర్తీ చేస్తూ ప్రభంజనం సృష్టిస్తోంది. ఇందులో భాగంగా 13,931 ఖాళీలతో భారీ స్థాయిలో పోస్టులను భర్తీ చేయనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. సొంత గ్రామంలోనే ఉద్యోగాన్ని సాధించే అవకాశం, అదీను రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ( మెరిట్ ) ద్వారా భర్తీ చేయనున్నారు కాబట్టి ప్రతిఒక్కరు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తుతో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు సొంత గ్రామం నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

AP Grama Ward Volunteer Recruitment 2020

సంస్థ పేరు :
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ శాఖ
పోస్టులు : గ్రామ వార్డు వాలంటీర్ పోస్టులకు భర్తీకి విదులైన ఈ నోటిఫికేషన్ నందు జిల్లాల వారీగా పోస్టులు క్రింది విధంగా ఉన్నాయి.
నెల్లూరు – 1419 పోస్టులు
వైయస్ఆర్ కడప – 575 పోస్టులు
చిత్తూరు – 3287 పోస్టులు
శ్రీకాకుళం – 536 పోస్టులు
ఈస్ట్ గోదావరి – 1334 పోస్టులు
గుంటూరు – 1158 పోస్టులు
ప్రకాశం – 854 పోస్టులు
కర్నూల్ – 298 పోస్టులు
పశ్చిమ గోదావరి – 1183 పోస్టులు
అనంతపురం – 2302 పోస్టులు
విశాఖపట్నం – 993 పోస్టులు

అర్హతలు :

విద్యార్హత : పంచాయతీ రాజ్ శాఖ నుండి విడుదలైన పోస్టులకు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు క్రింది విద్యార్హతలు కలిగి ఉండాలి.
• 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
• ప్రభుత్వ సంక్షేమ పథకాల పై పూర్తి పట్టు, అవగాహన కలిగి ఉండాలి.
• ప్రభుత్వ పథకాల గురించి సామాన్య ప్రజలకు వివరించే నేర్పు కలిగి ఉండాలి.
• కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు సాఫ్ట్ స్కిల్స్ అవసరం.
• తెలుగు రాయడం మరియు చదవడం తెలిసి ఉండాలి.
వయస్సు :
దరఖాస్తు దారులు 18 – 35 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి.
SC | ST వారికి 5 సంవత్సరాలు, BC వారికి 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పిస్తారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికయ్యేటువంటి అభ్యర్థులు పంచాయతీ రాజ్ శాఖ యొక్క స్టాండడ్స్ ప్రకారం రూ 5,000 ల జీతం లభిస్తుంది.

దరఖాస్తు విధానం :
• అభ్యర్థులు ఆన్‌లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి ఫీజు లేదు
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుకు సంబంధించి జిల్లాల వారీగా ప్రారంభ మరియు ఆఖరి తేదీలు వేరు వేరుగా ఉన్నాయి. క్రింది నోటిఫికేషన్ లింక్ నందు గమనించి దరఖాస్తు చేసుకోగలరు.
దరఖాస్తు ప్రారంభ తేదీ – డిసెంబర్ 12, 2020
దరఖాస్తు ఆఖరు తేదీ – డిసెంబర్ 29, 2020

ఎంపిక విధానము :
అభ్యర్థులను ఎటువంటి రాత పరీక్ష లేకుండానే, కేవలం ఇంటర్వ్యూ ( మెరిట్ ) ద్వారా ఎంపిక చేస్తారు. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన పూర్తి సమాచారం మరియు సిలబస్ కొరకు క్రింది ముఖ్యమైన లింకుల విభాగంలోని నోటిఫికేషన్ నందు పొందుపరుస్తాను, డౌన్లోడ్ చేసుకొని గమనించగలరు.
ముఖ్యమైన లింకులు : ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్ క్లిక్ హియర్
అధికారిక వెబ్ సైట్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై క్లిక్ హియర్
AP Grama Ward Volunteer Recruitment

Leave a Comment