Group – 4 Jobs : సంక్షేమశాఖలో ఉద్యోగాలు భర్తీ

Welfare Department Recruitment :

ఆంధ్రప్రదేశ్, చిత్తూరు సాంఘిక సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా కేస్ వర్కర్, పారా మెడికల్ పర్సనల్ మరియు నైట్ గార్డ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాంటాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. సొంత జిల్లాలలోనే ఉద్యోగం, రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ( మెరిట్ ) ద్వారా ఎంపిక లాంటి మంచి అవకాశాలు కలవు కాబట్టి, ప్రతిఒక్కరు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తుతో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు చిత్తూరు జిల్లా నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Welfare Department Recruitment

సంస్థ పేరు :
స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ
పోస్టులు : సఖి వన్ స్టాఫ్ సెంటర్ నుండి విడుదలైన ఈ నోటిఫికేషన్ నందు క్రింది ఖాళీలను భర్తీ చేయనున్నారు.
కేస్ వర్కర్, పారా మెడికల్ పర్సనల్, సెక్యూరిటీ నైట్ గార్డ్

అర్హతలు :

విద్యార్హత : స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని సఖి వన్ స్టాఫ్ సెంటర్ నుండి వచ్చినటువంటి నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు పోస్టుల వారీగా క్రింది విద్యార్హతలు కలిగి ఉండాలి.
కేస్ వర్కర్ : లా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి లేదా సోషల్ వర్క్ విభాగంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి మూడేళ్ళ అనుభవం కలిగి ఉండాలి.
పారా మెడికల్ పర్సనల్ : పారా మెడిక్స్ విభాగంలో డిగ్రీ మరియు మూడేళ్ళ అనుభవం.
సెక్యూరిటీ నైట్ గార్డ్ : చదువుతో సంబంధం లేకుండా, ఏదైనా సంస్థలో పని చేసిన అనుభవం కలిగి ఉంటే చాలు.
వయస్సు :
దరఖాస్తు దారులు 18 – 42 ఏళ్ల లోపు వయస్సు కలిగి ఉండాలి.
SC | ST వారికి 5 సంవత్సరాలు, BC వారికి 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పిస్తారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికయ్యేటువంటి అభ్యర్థులు సంస్థ యొక్క స్టాండడ్స్ ప్రకారం నైట్ గార్డ్ – రూ 8,000 లు, పారా మెడికల్ వర్కర్ – రూ 12,000 లు మరియు కేస్ వర్కర్ – రూ 13,000 ల జీతం లభిస్తుంది.

దరఖాస్తు విధానం :
• అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
• అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను ‘ డైరెక్టర్, స్త్రీ మరియు శిశు సంక్షేమ సంస్థ, వైయస్సార్ కడప ‘ అనే చిరునామా కు చేరవేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి
దరఖాస్తు ఫీజు :
జనరల్ అభ్యర్థులు – ఎటువంటి ఫీజు లేదు,
మిగితా అభ్యర్థులు – ఎటువంటి ఫీజు లేదు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుకు చివరి తేదీ – డిసెంబర్ 31, 2020
ఎంపిక విధానము :
అభ్యర్థులను ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన పూర్తి సమాచారం మరియు సిలబస్ కొరకు క్రింది ముఖ్యమైన లింకుల విభాగంలోని నోటిఫికేషన్ నందు పొందుపరుస్తాను, డౌన్లోడ్ చేసుకొని గమనించగలరు.
ముఖ్యమైన లింకులు : ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్ క్లిక్ హియర్
అప్లికేషన్ ఫార్మ్ క్లిక్ హియర్

Leave a Comment