Local Jobs 2023 ప్రభుత్వ పాఠశాలలో గ్రేడ్-4 భారీగా ఉద్యోగాలు భర్తీ

Local Jobs 2023 :

మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలలకు తాత్కాలిక పద్ధతిలో గ్రేడ్-4 ఉద్యోగాలను నియమించేందుకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా శిథిలావస్తకు చేరిన సర్కారు పాఠశాలలను సర్వాంగ సుందరంగా అన్ని రకాల మౌలిక వసతులను రాష్ట్రప్రభుత్వం కల్పిస్తోంది. పాఠశాలల్లో ఉండే విలువైన పరికరాలు, సామగ్రికి రక్షణా లేకుండా పోవడం ముఖ్యానంగా చెప్పుకోవచ్చు. ఈమేరకు ఆయా పాఠశాలలకు నైట్ వాచ్ మెన్లను నియమించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1982 పాఠశాలల్లో వీరిని నియమించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారును పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన ఉత్తర్వుల్లో తెలిపారు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
Ap govt jobs 2023

Night Watchmen jobs in TS Govt High schools :

రాష్ట్రంలో 535 ప్రైమరీ స్కూళ్లు, 93 యూపీఎస్, 1354 హైస్కూళ్లలో వీరిని అపాయింట్ చేయనున్నట్లు పేర్కొన్నారు. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 155. రంగా రెడ్డి జిల్లాలో 15 మంది అలానే వరంగల్, జోగుళాంబ గద్వాలలో 11 మంది చొప్పున వాచ్ మన్లను నియమించనున్నట్లు చెప్పారు. వీరికి నెలకు రూ.5 వేలు గౌరవ వేతనం ఇచ్చేలా నియమించాలని కోరారు. ఇక ఎంపిక ప్రక్రియ గమనించిట్లైతే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ద్వారా వాచ్మెన్ల నియామకం చేపట్టాలని సూచించారు.

మరిన్ని ఉద్యోగాలు :

Government High School Night watchmen jobs in TS 2023 :

తెలంగాణ రాష్ట్రప్రభుత్వం దశల వారీగా డిజిటల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పెంచాలని భావిస్తోంది. దీనికొరకు మన ఊరు మన బడి లేదా మన బస్తి మన బడి పథకాన్ని తీసుకొచ్చి అమలు చేస్తోంది. దశల వారీగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునీకరణ, స్కూళ్లలో 12 రకాల మౌళిక సదుపాయల కల్పనకు పటిష్ట చర్యలు తీసుకోనుంది. ఈ స్కీమ్‌ను గ్రామీణ ప్రాంతాలలో మన ఊరు మన బడి పేరు పెట్టగా, పట్టణ ప్రాంతాలలో మన బస్తి మన బడి పేరుతో అమలు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకే తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థ పై అత్యధికంగా నిధులు వెచ్చించింది మరియు వెచ్చిచనుంది.

TS Govt Job Updates 2023 :

మొదలు ప్రభుత్వ, స్థానిక సంస్థలకు చెందిన పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేయనుండగా, ఆయా పాఠశాలలో నీటి సౌకర్యంతో పాటు టాయిలెట్లు, తాగునీటి సరఫరా, విద్యుద్దీకరణ, విద్యార్థులు, సిబ్బందికి సరిపడే ఫర్నీచర్ అందించడం, పాఠశాలలు నవీకరించడం, మరమ్మత్తులు చేయడం, కిచెన్లు ఏర్పాటు, డైనింగ్ హాళ్లు, శిథిలమైన గదుల స్థానంలో కొత్త క్లాస్ రూంలు ఏర్పాటు చేయడం, డిజిటల్ విద్య వంటి వాటిని అమలు చేస్తోంది. పాఠశాలల్లో ఉండే విలువైన పరికరాలు, సామగ్రికి రక్షణ లేకుండా పోవడంతో ఈమేరకు ఆయా పాఠశాలలకు నైట్ వాచ్ మెన్లను నియమించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *