ఒకే ఒక ఇంటర్వ్యూతో వార్డు బాయ్,అకౌంటెంట్,డిటిపి ఆపరేటర్ లాంటి ఉద్యోగ అవకాశాలు | Private Jobs

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నందు గల పెద్దేశ్వర హార్ట్ కేర్ సెంటర్ నుండి ఉద్యోగాల భర్తీకి ప్రకటనను విడుదల చేసారు. ఈ ప్రకటనలో భాగంగా డ్యూటీ డాక్టర్లు, ఆనస్థీషియస్ట్, జనరల్ ఫిజిషియన్, నర్సింగ్ స్టాఫ్, బయో కెమిస్ట్, వార్డు బాయ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పురుష మరియు మహిళా అభ్యర్థులకు చాలా మంచి అవకాశం. ప్రస్తుత పరిస్థితుల్లో సొంత జిల్లాలోనే ఒక ఉద్యోగాన్ని పొందే మంచి అవకాశం, అదీను ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటివంటి వారు బియోడేటా పత్రముతో ఇంటర్వ్యూ కు హాజరు కాగలరు. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్, విజయవాడలోని పెద్దేశ్వర హార్ట్ కేర్ సెంటర్ నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Telugujobalerts24 | Private Jobs

సంస్థ పేరు :
పెద్దేశ్వర హార్ట్ కేర్ సెంటర్
పోస్టులు : ఈ ప్రకటన ద్వారా విజయవాడలోని పెద్దేశ్వర హార్ట్ కేర్ సెంటర్ నందు ఖాళీలగా ఉన్నటువంటి క్రింది ఖాళీలను భర్తీ చేయనున్నారు.
డ్యూటీ డాక్టర్లు, ఆనస్థీషియస్ట్, జనరల్ ఫిజిషియన్, నర్సింగ్ స్టాఫ్, బయో కెమిస్ట్, వార్డు బాయ్, నర్సింగ్ స్టాఫ్, ఎక్స్-రె టెక్నీషియన్, అకౌంటెంట్, డిటిపి ఆపరేటర్, హౌస్ కీపింగ్ సూపర్ వైసర్.

అర్హతలు :

విద్యార్హతలు :
● ఎక్స్ – రె టెక్నిషియన్ : 10వ తరగతితో పాటు సంబంధిత విభాగంలో డిప్లొమా మరియు అనుభవం
● ల్యాబ్ టెక్నిషియన్ : 10వ తరగతితో పాటు సంబంధిత విభాగంలో డిప్లొమా మరియు అనుభవం
● నర్సింగ్ స్టాఫ్ : జి యన్ యం లేదా నర్సింగ్ విభాగం డిప్లొమా లేదా గ్రాడ్యుయేట్
● అకౌంటెంట్ : అకౌంట్స్ విభాగంలో డిగ్రీ
● టియంటి ఎకో టెక్నీషియన్ : డిప్లొమా పూర్తి చేసిన మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు
● డాక్టర్లు : సంబంధిత విభాగంలో యండి
● హౌస్ కీపర్స్ : కనీసం 5వ తరగతి మరియు చదవడం, రాయడం తెలిసి ఉండాలి.
వయస్సు :
దరఖాస్తు దారులు 18 – 50 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి.
జీతం :
ఈ నోటిఫికేషన్ ద్వారా అభ్యర్థులు ఎంపికయినట్లైతే పెద్దేశ్వర హార్ట్ కేర్ మరియు ప్రభుత్వ లేబర్ ఆక్ట్ వారి స్టాండర్డ్స్ ప్రకారం పోస్టు మరియు అనుభవాన్ని బట్టి వేతనం లభిస్తుంది.

దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
• అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి బయో డేటా పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
• అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• బయో డేటా మరియు తగు అర్హతల పత్రాలను ఇంటర్వ్యూ కు తీసుకెళ్తే సరిపోతుంది.
దరఖాస్తు ఫీజు :
జనరల్ అభ్యర్థులు కానీ మరియు మిగితా అభ్యర్థులు కానీ, ఎవ్వరూ కూడా ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు.
ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ ప్రారంభ తేదీ – డిసెంబర్ 03, 2020
ఇంటర్వ్యూ ఆఖరు తేదీ – డిసెంబర్ 06, 2020

ఎంపిక విధానము :
అభ్యర్థుల ఎంపిక, ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది.
ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం :
పెద్దేశ్వర హార్ట్ కేర్ సెంటర్,
దోర్నాకల్ రోడ్డు, ఆంధ్ర బ్యాంక్ దగ్గర, సూర్యాపేట్, విజయవాడ – 520002.

ముఖ్యమైన లింకులు : నోటిఫికేషన్లోని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకుల పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.
నోటిఫికేషన్ : క్లిక్ హియర్
బయో డేటా పత్రము : క్లిక్ హియర్
గమనిక :
ఈ ప్రకటనలోని ఉద్యోగాలకు సంబంధించిన జీత భత్యాలు అలానే మరింత సమాచారం కొరకు క్రింది నంబర్లకు సంప్రదించండి.
ఫోన్ నంబర్లు :
9848229295

Leave a Comment