సొంత గ్రామాలలలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం, అనంతపురం జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ప్రకటనలో భాగంగా భారీ స్థాయిలో అంగన్వాడీ కార్యకర్తలు, మినీ అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. రెగులర్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అనంతపురం జిల్లా వారు అలానే మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. సొంత జిల్లాలోనే ఉద్యోగాన్ని సాధించే అవకాశం, అదీను ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ( మెరిట్ ) ద్వారా భర్తీ చేయనున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తుతో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు అనంతపురం జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింది సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ పేరు :
స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ
పోస్టులు : అంగన్వాడీ పోస్టుల భర్తీ కొరకు విదులైన ఈ నోటిఫికేషన్ నందు క్రింది పోస్టులను భర్తీ చేయనున్నారు.
అంగన్వాడీ కార్యకర్తలు – 132 పోస్టులు
మినీ అంగన్వాడి కార్యకర్తలు – 656 పోస్టులు
ఆయాలు – 67 పోస్టులు
అర్హతలు :
విద్యార్హత : స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ లోని అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు క్రింది విద్యార్హతలు కలిగి ఉండాలి.
• 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి.
• తప్పనిసరిగా వివాహితై ఉండాలి.
• తప్పనిసరిగా అభ్యర్థులు స్థానికులై ఉండాలి.
వయస్సు :
దరఖాస్తు దారులు 18 – 35 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి.
SC | ST వారికి 5 సంవత్సరాలు, BC వారికి 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పిస్తారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికయ్యేటువంటి అభ్యర్థులు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వారి యొక్క స్టాండడ్స్ ప్రకారం క్రింది విధంగా జీతం లభిస్తుంది.
అంగన్వాడీ కార్యకర్తలు – రూ 11,500/-
మినీ అంగన్వాడీ కార్యకర్తలు,ఆయాలు – రూ 7,500/-
దరఖాస్తు విధానం :
• అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
• అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను ‘ ఆయా ICDS ప్రాజెక్టు అధికారులకు ‘ చేరవేయండి.
భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి ఫీజు లేదు
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ – డిసెంబర్ 12, 2020
దరఖాస్తు ఆఖరు తేదీ – డిసెంబర్ 19, 2020
ఎంపిక విధానము :
అభ్యర్థులను ఎటువంటి రాత పరీక్ష లేకుండానే, కేవలం ఇంటర్వ్యూ ( మెరిట్ ) ద్వారా భర్తీ చేస్తారు. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన పూర్తి సమాచారం మరియు సిలబస్ కొరకు క్రింది ముఖ్యమైన లింకుల విభాగంలోని నోటిఫికేషన్ నందు పొందుపరుస్తాను, డౌన్లోడ్ చేసుకొని గమనించగలరు.
ముఖ్యమైన లింకులు : ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.
సూచన : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అభ్యర్థులు మీ ప్రాంతంలోని అంగన్వాడీ పోస్టుల ఉద్యోగ సమాచారాన్ని పొందలనుకుంటున్నారా, అయితే మీ ప్రాంతం మరియు జిల్లా పేరుని కామెంట్ విభాగంలో తెలియజేసినట్లైయితే మీ ప్రాంతంలో విడుదలయ్యే ఉద్యోగ సమాచారాన్ని నోటిఫికేషన్స్ విడుదలైన వెంటనే తెలియజేస్తాము.
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
అధికారిక వెబ్ సైట్ | క్లిక్ హియర్ |
అప్లికేషన్ పత్రము | క్లిక్ హియర్ |
Ekkada Ela apply cheyali
ఆన్లైన్ అప్లై అనే అప్షన్ పై క్లిక్ చేసి అపల్లి చేసుకోగలరు
Dear Team,
I completed my graduation in Gitam university in 2019 .
I waiting for government job
I unable to apply for job
What happen ?
Good Which District and which category do you need ?
Reddyvaripalli.sadummondal.palamanda.chittoordt
మీ గ్రామంలో ఖాళీగా ఉన్నట్లైయితే అప్లై చేసుకోగలరు
Hi
Hello
When.is.coming
అర్ధం కాలేదండి.మరో సారి తెలియజేయండి
Este.kada
Apply chesukovachu