జిల్లా ఆఫీసులలో ఉద్యోగాలు భర్తీ | Deta Entry Operator Jobs

Deta Entry Operator Recruitment 2020 :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూల్ జిల్లా అంధత్వ నివారణా సంస్థలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. సొంత జిల్లాలోనే ఉద్యోగాన్ని సాధించే అవకాశం, అదీను రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ( మెరిట్ ) ద్వారా భర్తీ చేయనున్నారు కాబట్టి ప్రతిఒక్కరు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తుతో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు జిల్లా అంధత్వ నివారణా ఆసుపత్రి, కర్నూల్ నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Deta Entry Operator jobs in District Offices

సంస్థ పేరు :
జిల్లా వైద్య మరియు ఆరోగ్య సంస్థ, కర్నూల్
పోస్టులు : జిల్లా అంధత్వ నివారణా సంస్థ నుండి విడుదలైన మెడికల్ నోటిఫికేషన్ నందు క్రింది ఖాళీలను భర్తీ చేయనున్నారు.
డేటా ఎంట్రీ ఆపరేటర్

అర్హతలు :

విద్యార్హత : జిల్లా వైద్య మరియు అంధత్వ ఆసుపత్రి నుండి విడుదలైన పోస్టులకు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు క్రింది విద్యార్హతలు కలిగి ఉండాలి.
• ఏదైనా డిగ్రీ పూర్తి చేసి, కంప్యూటర్ సెర్టిఫికేట్ గల వారు దరఖాస్తు చేసుకోవాలి.
• జాతీయ అంధత్వ నివారణా కార్యక్రమం నందు ఏడాది పాటు అనుభవం కలిగి ఉండాలి
వయస్సు :
దరఖాస్తు దారులు 18 – 42 ఏళ్ల లోపు వయస్సు కలిగి ఉండాలి.
SC | ST వారికి 5 సంవత్సరాలు, BC వారికి 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పిస్తారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికయ్యేటువంటి అభ్యర్థులు సంస్థ యొక్క స్టాండడ్స్ ప్రకారం క్రింది విధంగా జీతం లభిస్తుంది.
డేటా ఎంట్రీ ఆపరేటర్ – రూ 17,500/-

దరఖాస్తు విధానం :
• అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే దరఖాస్తు రుసుము చెల్లించండి.
అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అభ్యర్థులు బయో డేటా మరియు అర్హతల పత్రాలను ఇంటర్వ్యూ కు తీసుకెళ్తే సరిపోతుంది
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి ఫీజు లేదు
ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ ప్రారంభ తేదీ – డిసెంబర్ 21, 2020
సమయం – ఉదయం 11 గంటల నుండి మొదలవుతుంది.
ఇంటర్వ్యూ ప్రదేశం – జిల్లా వైద్య మరియు ఆరోగ్య సంస్థ కార్యాలయం, కర్నూల్

ఎంపిక విధానము :
అభ్యర్థులను ఎటువంటి రాత పరీక్ష లేకుండానే, కేవలం ఇంటర్వ్యూ ( మెరిట్ ) ద్వారా ఎంపిక చేస్తారు. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన పూర్తి సమాచారం మరియు సిలబస్ కొరకు క్రింది ముఖ్యమైన లింకుల విభాగంలోని నోటిఫికేషన్ నందు పొందుపరుస్తాను, డౌన్లోడ్ చేసుకొని గమనించగలరు.
ముఖ్యమైన లింకులు : ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్ క్లిక్ హియర్
అధికారిక వెబ్ సైట్ క్లిక్ హియర్
AP Govt Jobs 2020

సూచన : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అభ్యర్థులు మీ జిల్లాలోని ఇటువంటి ఉద్యోగ సమాచారాన్ని మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందలనుకుంటున్నారా, అయితే మీ జిల్లా పేరు ను కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇక ఆ బాధ్యత మేము తీసుకొని నోటిఫికేషన్ విడుదలైన వెంటనే మీకు తెలియజేస్తాము.

10 thoughts on “జిల్లా ఆఫీసులలో ఉద్యోగాలు భర్తీ | Deta Entry Operator Jobs”

    • తప్పకుండా తెలియజేస్తానండి. 10 రోజులలో జిల్లాల వారీగా ఉద్యోగాల సమాచారాన్ని వెంటనే తెలియజేస్తాము.ఒక్క 10 రోజులండి. ప్రస్తుతం మా యాప్ ద్వారా అందిస్తున్నాము.యాప్ డౌన్లోడ్ చేసుకోగలరు

      Reply
  1. Govt. Job(outsourcing/contract) Data Entry / Computer Operator / Office Junior assistant / Back office new Notifications in Guntur. Please inform. Tq.

    Reply

Leave a Comment