ప్రభుత్వ ట్యూటర్ జాబ్స్ | Telugujobalerts24

ట్యూటర్ ఉద్యోగాలకు మంచి నోటిఫికేషన్ :

భార‌త ప్ర‌భుత్వ ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన‌ ఆంధ్రప్రదేశ్, మంగ‌ళ‌గిరిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ ( AIIMS ) లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా ట్యూట‌ర్స్‌ / డెమాన్‌స్ట్రేట‌ర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్షా ఉండదు కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది, కాబట్టి ప్రతిఒక్కరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా ఇంటర్వ్యూకి హాజరవ్వండి. ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ లోని ఏఐఐయంయస్ నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

AIIMS Recruitment 2021

సంస్థ పేరు :
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ ( AIIMS )
పోస్టులు : ఈ నోటిఫికేషన్ ద్వారా కుటుంబ మరియు ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న క్రింది పోస్టులను భర్తీ చేయనున్నారు.
ట్యూటర్స్ మరియు డేమాన్స్ట్రేటర్స్

అర్హతలు :

విద్యార్హతలు : ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ ద్వారా విడుదలైన ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు క్రింది విద్యార్హతతో పాటు మరిన్ని అర్హతలను కలిగి ఉండాలి.
• సంబంధిత స్పెష‌లైజేష‌న్ల‌లో ఎండీ / పీహెచ్‌డీ ఉత్తీర్ణ‌త‌. నాన్ మెడిక‌ల్ అభ్య‌ర్థుల‌కు సంబంధిత స‌బ్జెక్టుల్లో పోస్టు గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణ‌త‌.
• డీఎంసీ / ఎంసీఐ / రాష్ట్ర రిజిస్ట్రేష‌న్ త‌ప్ప‌నిస‌రి.
వయస్సు :
35 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
SC / ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, BC అభ్యర్థులకు 5 సంవత్సరాల వయస్సులో సడలింపు కల్పిస్తారు.

Read Also : సర్వ శిక్షా అభియాన్ లో 10,112 ఉద్యోగాలకు నోటిఫికేషన్ – క్లిక్ హియర్

జీతం :
AIIMS, మంగళగిరి నుండి విడుదలైన నోటిఫికేషన్ ద్వారా అభ్యర్థులు ఎంపికయినట్లైతే సంస్థ వారి స్టాండర్డ్స్ మరియు పోస్టును బట్టి రూ 45,000/- నుండి 1,25,000 వరకు జీతం పొందుతారు.
దరఖాస్తు విధానం :
• అభ్యర్థులు తగు పత్రాలను మెయిల్ చేయాలి మరియు ఇంటర్వ్యూకు తీసుకెళ్లండి.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
• అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలతో ‘ recruitment@aiimsmangalagiri.edu.in ‘ అనే మెయిల్ ఐడి కు పంపించండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి
దరఖాస్తు ఫీజు :
జనరల్ అభ్యర్థులు – రూ 1,000/- మరియు
మిగితా అభ్యర్థులు – రూ 5,00/- లు చెల్లించాలి.

Read Also : APSRTC లేటెస్ట్ నోటిఫికేషన్ – క్లిక్ హియర్

ఎంపిక విధానము :
అభ్యర్థుల ఎంపిక, ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన పూర్తి సమాచారం మరియు సిలబస్ కొరకు క్రింది ముఖ్యమైన లింకుల విభాగంలోని నోటిఫికేషన్ నందు కలదు డౌన్లోడ్ చేసుకొని గమనించగలరు.
ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ తేదీ – 27/01/2021
ముఖ్యమైన లింకులు : ప్రకటనలోని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకుల పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.
నోటిఫికేషన్ : క్లిక్ హియర్
అప్లికేషన్ ఫార్మ్ : క్లిక్ హియర్

సూచన : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అభ్యర్థులు మీ ఉద్యోగ సమాచారాన్ని మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందలనుకుంటున్నారా, అయితే మీ జిల్లా పేరు ను కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇక ఆ బాధ్యత మేము తీసుకొని నోటిఫికేషన్ విడుదలైన వెంటనే మీకు తెలియజేస్తాము. కొంత కాల వ్యవధిలో ఉద్యోగ ఖాళీలను మాత్రమే అందిస్తాము.

Leave a Comment