Educational Department Recruitment | School Assistant Jobs

రాతపరీక్ష లేకుండానే విద్యాశాఖలో స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మచిలీపట్నం లోని చిలకపూడి ప్రాంతంలో గల గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఒప్పందా ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా సోషల్ స్టడీస్ మరియు ఫిజికల్ సైన్స్ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. సొంత జిల్లాలోనే ఒక ఉద్యోగాన్ని పొందే మంచి అవకాశం అదీను రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది, కాబట్టి ఆశక్తి ఉన్నటివంటి ప్రతిఒక్కరు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్, రాష్ట్రంలోని మచిలీపట్నం, చిలకపూడి నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

School Assistant Recruitment 2020

సంస్థ పేరు :
గిరిజన ఆశ్రమ పాఠశాల
పోస్టులు : ఈ నోటిఫికేషన్ ద్వారా గిరిజన ఆశ్రమ పాఠశాల, చిలకపూడిలోని క్రింది విభాగాలలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

సబ్జెక్టుపోస్టులు
భౌతిక శాస్త్రం01
సాంఘిక శాస్త్రం01
AP School Assistant Vacancies

అర్హతలు :

విద్యార్హత : ఆశ్రమ పాఠశాలలోని స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు క్రింది విద్యార్హతలు కలిగి ఉండాలి.
భౌతిక శాస్త్రం :
• ఫిజిక్స్ / అప్లైడ్ ఫిజిక్స్ / ఇంజనీరింగ్ ఫిజిక్స్ & ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కెమిస్ట్రీ / అప్లైడ్ కెమిస్ట్రీ / ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ / ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ / మెడిసినల్ కెమిస్ట్రీ / బయో కెమిస్ట్రీ / జియాలజీ లేదా ఫిజిక్స్ ఐచ్చిక సబ్జెక్టుతో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
• ఫిజికల్ సైన్స్ / అప్లైడ్ ఫిజిక్స్ / కెమిస్ట్రీ విభాగాలలో మెథడాలజీ సబ్జెక్టుగా బీఎడ్ పూర్తి చేసి ఉండాలి.
• ఆనుభవం కల అభ్యర్థులకు ప్రాధాన్యత కల్పిస్తారు.
సాంఘిక శాస్త్రం :
• చరిత్ర, ఎకనామిక్స్, భౌగోళిక, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, కామర్స్, పాలిటిక్స్, సోషల్ ఆంత్రోపాలజీ, ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ కల్చర్ & ఆర్కియాలజీ, ఆంత్రోపాలజీ, సోషల్ వర్క్, ఫిలాసఫీ మరియు సైకాలజీ కింది రెండు సబ్జెక్టులతో ఐచ్ఛికంగా బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి లేదా వాటిలో ఒకటి ప్రధానంగా మరియు మరొకటి అనుబంధ సబ్జెక్టుగా ఉండాలి.
• పై విభాగాలలో ఎదో ఒక విభాగం మెథదాలజీగా కలిగి ఉండాలి.
• ఆనుభవం కల అభ్యర్థులకు ప్రాధాన్యత కల్పిస్తారు.
వయస్సు :
దరఖాస్తు దారులు 18 – 35 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి.
SC | ST వారికి 5 సంవత్సరాలు, BC వారికి 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పిస్తారు.

జీతం :
గిరిజన ఆశ్రమ పాఠశాల వారి ఉత్తర్వుల ప్రకారం అనుభవ మరియు సబిజెక్టుని బట్టి వేతనం లభిస్తుంది.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్. • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
• అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ మరియు తగు అర్హతల పత్రాలను ‘ గిరిజన ఆశ్రమ పాఠశాల, చిలకపూడి, మచిలీపట్నం అనే చిరునామాకు చేరవేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజు :
ఎవ్వరికీ ఎటువంటి ఫీజు లేదు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ – డిసెంబర్ 03, 2020
దరఖాస్తు ఆఖరు తేదీ – డిసెంబర్ 07, 2020

ఎంపిక విధానము :
అభ్యర్థుల ఎంపిక ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం డెమో ద్వారా ఉంటుంది. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన పూర్తి సమాచారం మరియు సిలబస్ కొరకు క్రింది ముఖ్యమైన లింకుల విభాగంలోని నోటిఫికేషన్ నందు పొందుపరుస్తాను, డౌన్లోడ్ చేసుకొని గమనించగలరు.

ముఖ్యమైన లింకులు : నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్ క్లిక్ హియర్
అఫీషియల్ వెబ్సైట్ క్లిక్ హియర్
బయో డేటా పత్రము క్లిక్ హియర్
APSWRIES Recruitment

గమనిక :
ఈ ప్రకటనలోని ఉద్యోగాలకు సంబంధించిన జీత భత్యాలు అలానే మరింత సమాచారం కొరకు క్రింది నంబర్లకు సంప్రదించండి.
ఫోన్ నంబర్లు :
08672 – 252407,
96663925000

Leave a Comment