నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు | AU Non Teaching Staff Recruitment

తెలుగు రాష్ట్రంలో నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు భర్తీ :

విశాఖపట్నం లోని ఆంధ్రా విశ్వవిద్యాలయం, ఖాళీగా ఉన్నటువంటి నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. ఇందులో భాగంగా స్పెషల్ ఆఫీసర్, సెర్టిఫైడ్ అనలిస్ట్, సెక్యూరిటీ ఆఫీసర్, మెయిటెనెన్స్ ఇంజినీర్, ప్రోగ్రామర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. సొంత రాష్ట్రంలోనే ఉద్యోగాన్ని సాధించే అవకాశం, అదీను రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ( మెరిట్ ) ద్వారా భర్తీ చేస్తారు. కేంద్రప్రభుత్వ ఆధీనంలోని సంస్థ కాబట్టి తెలంగాణా మరియు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులిద్దరూ మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు ఆంధ్రవిశ్వవిద్యాలయం నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

AU Non Teaching Staff Recruitment 2020

సంస్థ పేరు :
ఆంధ్ర విశ్వవిద్యాలయం
పోస్టులు : ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్ర విశ్వవిద్యాలయం నందు గల క్రింది పోస్టులను భర్తీ చేయనున్నారు.
స్పెషల్ ఆఫీసర్, మెయిటెనెన్స్ ఇంజినీర్, ప్రోగ్రామర్, సెర్టిఫైడ్ అనలిస్ట్, సెక్యూరిటీ ఆఫీసర్,

అర్హతలు :

విద్యార్హత : ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి విడుదలైన నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు క్రింది విద్యార్హతలు కలిగి ఉండాలి.
పోస్టును అనుసరించి బియస్సి డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ, టెక్నాలజీ లేదా మేనేజ్మెంట్ విభాగంలో మాస్టర్స్ డిగ్రీ
వయస్సు :
దరఖాస్తు దారులు 18 – 45 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి.
SC | ST వారికి 5 సంవత్సరాలు, BC వారికి 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పిస్తారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికయ్యేటువంటి అభ్యర్థులకు ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి యొక్క స్టాండర్డ్స్ ప్రకారం వేతనాన్ని కేటాయిస్తారు.

దరఖాస్తు విధానం :
• అభ్యర్థులు మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
• అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ మరియు తగు అర్హతల పత్రాలను ‘ rusa2@andhrauniversity.edu.in అనే చిరునామాకు చేరవేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి ఫీజు లేదు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ – డిసెంబర్ 04, 2020
దరఖాస్తు ఆఖరు తేదీ – డిసెంబర్ 10, 2020

ఎంపిక విధానము :
అభ్యర్థుల ఎంపిక ఇంటర్వ్యూ ( మెరిట్ ) ద్వారా ఎంపిక చేస్తారు. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన పూర్తి సమాచారం మరియు సిలబస్ కొరకు క్రింది ముఖ్యమైన లింకుల విభాగంలోని నోటిఫికేషన్ నందు పొందుపరుస్తాను, డౌన్లోడ్ చేసుకొని గమనించగలరు.
ముఖ్యమైన లింకులు : ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్ క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ మరియు అఫీషియల్వె బ్ సైట్క్లిక్ హియర్
AU Non Teaching Staff Notification

1 thought on “నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు | AU Non Teaching Staff Recruitment”

Leave a Comment