విద్యాశాఖలో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు భర్తీ | Educational Department Recruitment

విద్యాశాఖలో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభత్వం విద్యాశాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా కడప మరియు చిత్తూరు జిల్లాలలోని డిగ్రీ కళాశాలల నందు ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులను భర్తీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం జీఓ విడుదల చేసింది. అతి త్వరలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. సొంత జిల్లాలోనే ఒక మంచి ఉపాధిని పొందే అవకాశం. 10వ తరగతి వారికి ఈ నోటిఫికేషన్ నందు ఉద్యోగాలు వుండనున్నాయి, అలానే డిగ్రీ మరియు పిజి పాసైన వారకి కూడా ఈ నోటిఫికేషన్ నందు ఉద్యోగాలు వుండనున్నాయి.

AP Educational Department Recruitment 2020

ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు ప్రక్రియ త్వరలో ప్రారంభంకానుంది. రాతపరీక్ష లేకుండా, కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలను కేటాయిస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు చిత్తూరు మరియు కడప జిల్లాలోని వివిధ డిగ్రీ కళాశాలల నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ పేరు :
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ
పోస్టులు : ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు మరియు కడప జిల్లాల డిగ్రీ కళాశాలలో క్రింది ఖాళీలను భర్తీ చేయనున్నారు.
టీచింగ్ స్టాఫ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులు, మొత్తం కలిపి 30 రకాల ఉద్యోగాలు జీఓ నందు కలవు.

అర్హతలు :

విద్యార్హత : ఈ ప్రకటన ద్వారా విడుదవబోయే ఉద్యోగాలకు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు క్రింది విద్యార్హతతో వుండనున్నట్లు ఆశిస్తున్నాము.
• 10వ తరగతి నుండి పిజి, పిహెచ్ది వరకు అర్హతగా ప్రకటించనున్నారు.
• సంబంధిత విభాగంలో కనీసం రెండు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
• అభ్యర్థులు తప్పనిసరిగా సొంత ప్రాంతం అనగా స్థానికులై ఉండాలి.
వయస్సు :
దరఖాస్తు దారులు 21 – 50 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి.
SC | ST వారికి 5 సంవత్సరాలు, BC వారికి 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పిస్తారు.
జీతం :
ఈ నోటిఫికేషన్ ప్రకారం ఎంపికకాబోయెటువంటి అభ్యర్థులు విద్యాశాఖ ఉత్తర్వుల ప్రకారం క్రింది విధంగా వేతనాలు పొందుతారు.
టీచింగ్ స్టాఫ్ – రూ 57,000/-
నాన్ టీచింగ్ స్టాఫ్ – రూ 23,000/- లు

దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
• అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
• అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు బయో డేటా పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ మరియు తగు అర్హతల పత్రాలను సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, సంగారెడ్డి జిల్లా అనే చిరునామాకు చేరవేయండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజు :
జనరల్ అభ్యర్థులు కానీ మరియు మిగితా అభ్యర్థులు కానీ, ఎవ్వరూ కూడా ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు. ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ – త్వరలో ప్రారంభమవుతుంది.
దరఖాస్తు ఆఖరు తేదీ – త్వరలో తెలియజేస్తారు.

ఎంపిక విధానము :
అభ్యర్థుల ఎంపిక, ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన పూర్తి సమాచారం మరియు సిలబస్ కొరకు ముఖ్యమైన లింకుల విభాగంలోని నోటిఫివ్లకేషన్ లో పొందుపరుస్తారు, డౌన్లోడ్ చేసుకొని గమనించగలుగుతారు.
ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం :
నోటిఫికేషన్ నందు తెలియజేస్తారు.

నోటిఫికేషన్ విడుదలైన వెంటనే మరో ఆర్టికల్ రూపంలో మీకు పూర్తి వివరాలు తెలియజెస్తాము.

6 thoughts on “విద్యాశాఖలో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు భర్తీ | Educational Department Recruitment”

Leave a Comment