ఏపిలో ఫీల్డ్ ఆఫీసర్ పోస్టులు భర్తీ | AP Field Officer Jobs

సమాచార శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ :

కేంద్రప్రభుత్వ సమాచార మంత్రిత్వ శాఖ ఆధీనంలోని బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రాంతీయ కేంద్రాలలో వప్పందా ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా విజయవాడ, భీమవరం, విశాఖపట్నం ప్రాంతీయ కేంద్రాలలో ఖాళీగా ఉన్నటువంటి ఫీల్డ్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. సొంత రాష్ట్రంలోనే ఒక ఉద్యోగాన్ని పొందే మంచి అవకాశం, రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటివంటి ప్రతిఒక్కరు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోగలరు. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్, రాష్ట్రంలోని విజయవాడ, భీమవరం, విశాఖపట్నం నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Field Officer Jobs 2020

సంస్థ పేరు :
బ్రాడ్ కాస్ట్ ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్
పోస్టులు : ఈ నోటిఫికేషన్ ద్వారా సమాచార మంత్రిత్వశాఖ పరిధిలోని క్రింది పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఫీల్డ్ టెక్నికల్ ఆఫీసర్ – 06 పోస్టులు
ఫీల్డ్ టెక్నికల్ ఆఫీసర్ ( జిఐయస్ ) – 02 పోస్టులు

అర్హతలు :

విద్యార్హత : బ్రాడ్ కాస్ట్ ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్, ఫీల్డ్ టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు క్రింది విద్యార్హతలు కలిగి ఉండాలి.
1. ఫీల్డ్ టెక్నికల్ ఆఫీసర్ –
• మ్యారికల్చర్, ఆక్వాకల్చర్, ఇండస్ట్రియల్ ఫిషరీస్, బయో టెక్నాలజీ విభాగాలలో పిజి ఉత్తేర్ణులై ఉండాలి.
• ష్రిమెప్ ఆక్వాకల్చర్ లేదా పరిశోధనల్లో కనీసం మూడు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
• తప్పనిసరిగా కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
2. ఫీల్డ్ టెక్నికల్ ఆఫీసర్ ( జిఐయస్ ) –
• ఏదైనా డిగ్రీ పాసైతే చాలు.
• అభ్యర్థులు జిఐయస్/రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్లో రెండేళ్ల అనుభవం కలిగి ఉండాలి.
• తెలుగు రాయడం మరియు చదవడం తప్పనిసరిగా తెలిసి ఉండాలి.
వయస్సు :
దరఖాస్తు దారులు 18 – 35 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి.
SC | ST వారికి 5 సంవత్సరాలు,O BC వారికి 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పిస్తారు. జీతం :
బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్, ఫీల్డ్ ఆఫీసర్ పోస్టులకు సంస్థ వారి ఉత్తర్వుల ప్రకారం రూ 30,000/- లు వేతనంగా అందుకుంటారు.

దరఖాస్తు విధానం : ఆన్ లైన్
• అభ్యర్థులు ఆన్‌లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజు :
జనరల్ అభ్యర్థులు – రూ 750/- లు
మిగితా అభ్యర్థులు – రూ 450/- లు చెల్లించాలి.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ – నవంబర్ 25, 2020
దరఖాస్తు ఆఖరు తేదీ – డిసెంబర్ 11, 2020

ఎంపిక విధానం :
రాతపరీక్ష నిర్వహించడం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ రాటపరీక్షకు సంబంధించిన పూర్తి సమాచారం మరియు సిలబస్ కొరకు క్రింది ముఖ్యమైన లింకుల విభాగంలోని నోటిఫికేషన్ నందు పొందుపరుస్తాను, డౌన్లోడ్ చేసుకొని గమనించగలరు.

ముఖ్యమైన లింకులు : నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్ క్లిక్ హియర్
అఫీషియల్ వెబ్సైట్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై క్లిక్ హియర్
BECIL Recruitment

3 thoughts on “ఏపిలో ఫీల్డ్ ఆఫీసర్ పోస్టులు భర్తీ | AP Field Officer Jobs”

Leave a Comment