జిల్లా ప్రభుత్వ ఆఫీసులో ఉద్యోగాలు | Latest Govt Jobs

రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూతో జిల్లా ఆఫీసులో ఉద్యోగాలు :

తెలంగాణా రాష్ట్రం, కామారెడ్డి జిల్లాలో ఉద్యోగ ఖాళీల కోసం ఎదురు చూసేవారికి శుభవార్త. జిల్లాలోని వైద్య మరియు ఆరోగ్య ఆఫీసు నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఇందులో భాగంగా స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ఈ రాష్ట్ర ప్రభుత్వ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు కామారెడ్డి జిల్లా వారు అలానే అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. సొంత జిల్లాలోనే ఉద్యోగాన్ని సాధించే అవకాశం, అదీను రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ( మెరిట్ ) ద్వారా భర్తీ చేయనున్నారు కాబట్టి ప్రతిఒక్కరు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తుతో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు కామారెడ్డి జిల్లా వైద్య శాఖ నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Latest Government job updates in telugu

సంస్థ పేరు :
వైద్య మరియు ఆరోగ్య శాఖ
పోస్టులు : తెలంగాణా ఆరోగ్య మరియు వైద్య శాఖ ద్వారా విదులైన ఈ నోటిఫికేషన్ నందు క్రింది పోస్టులను భర్తీ చేయనున్నారు.
స్టాఫ్ నర్స్ – 05 పోస్టులు

అర్హతలు :

విద్యార్హత : ట్రైనీ స్టాఫ్ నర్స్ పోస్టులకు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు క్రింది విద్యార్హతలు కలిగి ఉండాలి.
• జి యన్ యం లేదా బి యస్ సి నర్సింగ్ పూర్తి చేసి ఉండాలి.
• మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ కాబడి ఉండాలి.
వయస్సు :
దరఖాస్తు దారులు 18 – 38 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి.
SC | ST వారికి 5 సంవత్సరాలు, BC వారికి 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పిస్తారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికయ్యేటువంటి అభ్యర్థులు నేషనల్ హెల్త్ మిషన్ వారి యొక్క స్టాండర్డ్స్ ప్రకారం రూ 23,000 ల వేతనాన్ని అందుకుంటారు.

దరఖాస్తు విధానం :
• అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
• అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను ‘ District Medical And Health Officer,Kamareddy, TS ‘ అనే చిరునామాకు చేరవేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి ఫీజు లేదు
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ – డిసెంబర్ 06, 2020
దరఖాస్తు ఆఖరు తేదీ – డిసెంబర్ 10, 2020

ఎంపిక విధానము :
అభ్యర్థుల ఎంపిక ఇంటర్వ్యూ ( షార్ట్ లిస్టింగ్ ) ద్వారా చేస్తారు. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన పూర్తి సమాచారం మరియు సిలబస్ కొరకు క్రింది ముఖ్యమైన లింకుల విభాగంలోని నోటిఫికేషన్ నందు పొందుపరుస్తాను, డౌన్లోడ్ చేసుకొని గమనించగలరు.
ముఖ్యమైన లింకులు : ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్ క్లిక్ హియర్
అధికారిక వెబ్ సైట్ క్లిక్ హియర్

సూచన : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అభ్యర్థులు మీ ప్రాంతంలోని ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందలనుకుంటున్నారా, అయితే మీ ప్రాంతం అలానే మీరు ఏ విభాగంలో ఉద్యోగం పొందలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇక ఆ బాధ్యత మేము తీసుకొని కొంత కాల వ్యవధిలో ఉద్యోగ ఖాళీలను మాత్రమే అందిస్తాము.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *