ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు | MGNREGA Field Assistant Recruitment

కూలి పని విభాగంలో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ :

మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా మన తెలుగు రాష్ట్రాలలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేశారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ జిల్లాలో ఖాళీగా ఉన్నటువంటి 150 ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ ప్రకటనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యాప్తంగా ఖాళీల గుర్తింపు ప్రక్రియ ఊపందుకుంది. రాబోయే 2021 జనవరి నాటికల్లా ఉపాధి హామీ లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీతో పాటు, ఇప్పటికే పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 6,500 పోస్టులు, మిగిలిన శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అవకాశం ఉంది.
కూలి పనులు ప్రజలకు కల్పించాలంటే క్షేత్రస్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్లు చాలా అవసరమని తెలియజేశారు. అడిగిన వారందరికీ పని కల్పించడం, ప్రతి కుటుంబానికి 100 రోజుల పని ఇవ్వడం లాంటి విషయాలలో వీరి పాత్ర ప్రముఖం, కావున త్వరలో ఫీల్డ్ అసిస్టెంట్ల నియామక ప్రక్రియ జరగనుంది. క్రింద ఇవ్వబడిన పూర్తి సమాచారం తెలుసుకోవడం ద్వారా అర్హతల పూర్తి అవగాహనను పొందగలరు.

MGNREGA Field Assistant Recruitment

సంస్థ పేరు :
మహాత్మాగాంధీ గ్రామీణాభివృద్ధి శాఖ
పోస్టులు : గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని ఉపాధిహామీ పథకం నుండి విడుదల కాబోయే నోటిఫికేషన్ ద్వారా క్రింది పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఫీల్డ్ అసిస్టెంట్ – 120

సూచన : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అభ్యర్థులు మీ ప్రాంతంలోని ఉపాధి హామీ పథకంలో ఉద్యోగ సమాచారాన్ని పొందలనుకుంటున్నారా, అయితే మీ ప్రాంతం మరియు జిల్లా పేరుని కామెంట్ విభాగంలో తెలియజేసినట్లైయితే మీ ప్రాంతంలో విడుదలయ్యే ఉద్యోగ సమాచారాన్ని నోటిఫికేషన్స్ విడుదలైన వెంటనే తెలియజేస్తాము.

అర్హతలు :

విద్యార్హతలు : ఈ ప్రకటన ద్వారా విడుదలైన ఉద్యోగాలకు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు క్రింది విద్యార్హతతో పాటు మరిన్ని అర్హతలను కలిగి ఉండాలి.
• 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
• కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు సాఫ్ట్ స్కిల్స్ అవసరం.
• తెలుగు రాయడం మరియు చదవడం తెలిసి ఉండాలి.
• సామాజిక స్పృహ కలిగి ఉండాలి.
వయస్సు :
18 – 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
SC / ST / BC అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పిస్తారు.
జీతం :
ఈ నోటిఫికేషన్ ద్వారా అభ్యర్థులు ఎంపికయినట్లైతే ఫీల్డ్ అసిస్టెంట్ అభ్యర్థులు రూ 13,500 ల వేతనాన్ని పొందుతారు.

దరఖాస్తు విధానం :
• అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
• అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను ‘ నోటిఫికేషన్ నందు పేర్కొన్న చిరునామాకు చేరవేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి
దరఖాస్తు ఫీజు :
జనరల్ అభ్యర్థులు కానీ మరియు మిగితా అభ్యర్థులు కానీ, ఎవ్వరూ కూడా ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు.
ఎంపిక విధానము :
అభ్యర్థుల ఎంపిక, ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన పూర్తి సమాచారం మరియు సిలబస్ కొరకు క్రింది ముఖ్యమైన లింకుల విభాగంలోని నోటిఫికేషన్ నందు పొందుపరుస్తాను, డౌన్లోడ్ చేసుకొని గమనించగలరు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ – త్వరలో తెలియజేస్తారు
ముఖ్యమైన లింకులు : నోటిఫికేషన్లోని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకుల పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

అధికారిక వెబ్ సైట్ : క్లిక్ హియర్

104 thoughts on “ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు | MGNREGA Field Assistant Recruitment”

  1. Dalli Hemalatha
    Janathanagar moosapet Hyd
    Medical(malkajgiri) district kukatpally Mandal
    10th qualifications emaina jobs unte cheppadi

    Reply
  2. నా పేరు కృష్ణారెడ్డి,నేను విశాఖపట్నం లో ఉంటున్నాను ,నాకు వైజాగ్ మరియు ఆంధ్రప్రదేశ్ లో ఉండే గవర్నమెంట్ జాబ్స్ ఖాళీలు కోసం తెలియజేయగలరు,

    Reply
    • కచ్చితంగా ఒక వారంలో మేము జిల్లాల వారీగా అలానే ప్రతిదీ కూడా క్లుప్తనంగా అందిస్తాము.

      Reply

Leave a Comment