పోస్టల్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | Postal Jobs

తెలుగు రాష్ట్రంలో పోస్టల్ శాఖ నందు ఉద్యోగాలు భర్తీ :

తెలంగాణా సర్కిల్ లోని హైదరాబాద్ నందు పోస్టల్ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఇందులో భాగంగా స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. సొంత రాష్ట్రంలో ఒక కేంద్రప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించే అవకాశం, అదీను రాతపరీక్ష లేకుండానే కేవలం స్కిల్ టెస్ట్( మెరిట్ ) ద్వారా భర్తీ చేస్తారు. కేంద్రప్రభుత్వ ఆధీనంలోని సంస్థ కాబట్టి తెలంగాణా మరియు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులిద్దరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు తెలంగాణా సర్కిల్ లోని హైదరాబాద్ పోస్ట్ ఆఫీసులలో విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Postal Jobs 2020

సంస్థ పేరు :
పోస్టల్ శాఖ, తెలంగాణా సర్కిల్
పోస్టులు : ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణా సర్కిల్, హైదరాబాద్ నందు గల స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

విద్యార్హత : పోస్టల్ శాఖ నుండి విడుదలైన స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు క్రింది విద్యార్హతలు కలిగి ఉండాలి. > తప్పనిసరిగా 10వ తరగతి నందు ఉత్తీర్ణులై ఉండాలి.
> మోటార్ మేకనిజం నందు పరిజ్ఞానం కలిగి ఉండాలి.
> లైట్ మరియు హెవి మోటార్ వెహికల్ లైసెన్స్ కలిగి ఉండాలి.
> సివిల్ వాలంటీర్లు లేదా హోమ్ గార్డుగా మూడు సంవత్సరాల సర్వీస్ ఉన్నవారికి ప్రాధాన్యత కల్పిస్తారు.
వయస్సు :
దరఖాస్తు దారులు 18 – 27 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి.
SC | ST వారికి 5 సంవత్సరాలు, BC వారికి 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పిస్తారు.
జీతం :
కేంద్రప్రభుత్వం మరియు పోస్టల్ శాఖ వారి యొక్క ఉత్తర్వుల ప్రకారం ఈ ఉద్యోగాలకు ఏమపికయ్యేటువంటి అభ్యర్థులకు రూ 19,900/- ల వేతనాన్ని కేటాయిస్తారు.

దరఖాస్తు విధానం :
> అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
> అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ > చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
> అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
> అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
> అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
> అప్లికేషన్ మరియు తగు అర్హతల పత్రాలను ‘ సెక్రటరీ, జిల్లా గ్రంథాలయ సంస్థ, తూర్పుగోదావరి, సూపర్ మార్కెట్ ప్రక్కన, మెయిన్ రోడ్, కాకినాడ – 533001 అనే చిరునామాకు చేరవేయండి.
> భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి ఫీజు లేదు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ – డిసెంబర్ 04, 2020
దరఖాస్తు ఆఖరు తేదీ – డిసెంబర్ 26, 2020

ఎంపిక విధానము :
అభ్యర్థుల ఎంపిక, ట్రాఫిక్ రూల్స్, సిగ్నల్స్, కు సంభందించిన టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్ ( మెరిట్ ) ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ టెస్టులకు సంబంధించిన పూర్తి సమాచారం మరియు సిలబస్ కొరకు క్రింది ముఖ్యమైన లింకుల విభాగంలోని నోటిఫికేషన్ నందు పొందుపరుస్తాను, డౌన్లోడ్ చేసుకొని గమనించగలరు.
ముఖ్యమైన లింకులు : ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్ క్లిక్ హియర్
అధికారిక వెబ్సైట్ క్లిక్ హియర్
అప్లికేషన్ ఫార్మ్ క్లిక్ హియర్

2 thoughts on “పోస్టల్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | Postal Jobs”

Leave a Comment