TSRTC Recruitment 2021 | టీయస్ఆర్టీసి లో ఖాళీలు భర్తీ

టీయస్ఆర్టీసి లో రాతపరీక్ష లేకుండా అప్రెంటిస్ ఖాళీలు భర్తీ :

తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( TSRTC), 2020-21 సంవత్సరానికి గాని అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా సికింద్రాబాద్ రీజినల్ పరిధిలోని ఎంపిక చేయబడిన 12 డిపోలలో డీజిల్‌ మెకానిక్‌, ఎలక్ట్రిషన్‌, మోటార్‌ మెకానిక్ విభాగాలలోని ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు.

రాతపరీక్ష లేకుండా కేవలం మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు, కాబట్టి ప్రతిఒక్కరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా వెంటనే ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోండి. ఈ ఖాళీల భర్తీకి ఎంపికైతే అభ్యర్థులు సికింద్రాబాద్ రీజియన్ లోని 12 డిపోల నందు విధినిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ పేరు :
తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( TSRTC )

Read Also : APSRTC Upcoming 9000 Plus Vacancies Notification Details

TSRTC Recruitment Vacancies 2021 ( పోస్టులు ) : టీఎస్ఆర్టీసీ నుండి విడుదలైన ఈ నోటిఫికేషన్ నందు క్రింది పోస్టులను భర్తీ చేయనున్నరు.
వెల్డర్ – 03
డీజిల్‌ మెకానిక్‌ – 56
ఎలక్ట్రిషన్‌ – 12
మోటార్‌ మెకానిక్ – 04

TSRTC Recruitment 2021 Eligibility criteria :

విద్యార్హతలు : 10వ తరగతి ఉత్తీర్ణ‌త‌తో పాటు, డీజిల్‌ మెకానిక్‌, ఎలక్ట్రిషన్‌, మోటార్‌ మెకానిక్ ట్రేడుల్లో ఐటీఐ పూర్తిచేసి ఉండాలి.

వయస్సు : 14 – 21 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
SC / STఅభ్యర్థులు – 5 సం, BC అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పిస్తారు.
జీతం : ఈ ప్రకటన ద్వారా అభ్యర్థులు ఎంపికయినట్లైతే ఆర్టీసీ మరియు అప్రెంటిస్ శాఖ వారి స్టాండర్డ్స్ ప్రకారం రూ 6,931 నుండి 7797/- ల వరకు వేతనం అందుకుంటారు.
దరఖాస్తు విధానం : TSRTC Recruitment 2021 Apply Online
• అభ్యర్థులు ఆన్‌లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ www.tsrtconline.in నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజు :
జనరల్ మరియు మిగితా అభ్యర్థులు ఎవ్వరికీ ఎటువంటి ఫీజు లేదు.
ఎంపిక విధానము :
అభ్యర్థుల ఎంపిక రాతపరీక్ష లేకుండా కేవలం మార్కుల మెరిట్ ఆధారంగా ఉంటుంది. ఈ ఎంపికకు సంబంధించిన పూర్తి సమాచారం క్రింది ముఖ్యమైన లింకులు సెక్షన్ లోని నోటిఫికేషన్ నందు పొందుపరిచారు, డౌన్లోడ్ చేసుకొని గమనించండి.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుకు చివరి తేదీ – జనవరి 30, 2021
ముఖ్యమైన లింకులు : నోటిఫికేషన్లోని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకుల పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

ఆన్ లైన్ అప్లై : వెల్దర్ – క్లిక్ హియర్ మోటార్ మెకానిక్ – క్లిక్ హియర్ డీజల్ మెకానిక్ – క్లిక్ హియర్ ఎలెక్ట్రిషియన్ – క్లిక్ హియర్

సూచన : ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఎటువంటి సందేహం ఉన్న క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే మీ సందేహాన్ని నివృత్తి కలిగిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అభ్యర్థులు మీ జిల్లాలలోని ఉద్యోగ సమాచారాన్ని మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందలనుకుంటున్నారా అయితే, మీ జిల్లా పేరును కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే మీ జిల్లాల వారి ఉద్యోగ సమాచారాన్ని అందిస్తాము.

1 thought on “TSRTC Recruitment 2021 | టీయస్ఆర్టీసి లో ఖాళీలు భర్తీ”

Leave a Comment