జగనన్న ఫెలోషిప్ ద్వారా విద్యార్థులకు నెలకు 25,000 వెంటనే అప్లై చేయండి

Apply jaganannafellowship From APSSDC :

ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్-APSSDC జగనన్న సమ్మర్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ 2021 ప్రకటించింది. ఈ ఫెలోషిప్ ద్వారా అభ్యర్ధులకు నెలకు రూ 25,000 లు రానున్నాయి. ఇది కేవలం సమ్మర్ ఫెలోషిప్ మాత్రమే. అనగా మూడు నెలలు మాత్రమే ఉంటుంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలకు సంబంధించి విద్యార్థులు పనిచేయాల్సి ఉంటుంది. ఫెలోషిప్ యొక్క పూర్తి వివరాలు గమనించినచవచ్చు.

Raed More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు – ◆ వాట్సాప్ గ్రూప్ – 8 | ◆ వాట్సాప్ గ్రూప్ – 10 | ◆ వాట్సాప్ గ్రూప్ – 11 | ◆ వాట్సాప్ గ్రూప్ – 12

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ( APSSDC ) సమ్మర్ ఫెలోషిప్ కోసం దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. APSSDC జగనన్న సమ్మర్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ 2021 కోసం దరఖాస్తు చేయడానికి 2021 మే 18 వరకే అవకాశం ఉంది అనగా చివరి తేదీగా చెప్పుకోవచ్చు.

Telugujobalerts24.com

మే 20న షార్ట్‌లిస్ట్ చేసిన విద్యార్థుల జాబితాను APSSDC వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తారు. మే 21, 22 తేదీల్లో ఇంటర్వ్యూలు ఉంటాయి. మే 26న ఫెలోషిప్ కోసం విద్యార్థులను ఎంపిక చేస్తారు. 2021 జూన్ 1న ఫెలోషిప్ మొదలవుతుంది.

Jaganannafellowship 2021 Eligibility :

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన నవరత్నాలు, వ్యవసాయ ఉత్పత్తుల సప్లై చైన్, వ్యాల్యూ అడిషన్, ఆత్మనిర్భర్ భారత్, పీఎల్ఐ స్కీమ్, సేవా రంగం, వృద్ధుల సంరక్షణ, APSSDC ఆదాయ వనరులు సమకూర్చుకోవడం లాంటి అంశాలపై విద్యార్థులు పనిచేయాల్సి ఉంటుంది. మొత్తం 15 మందికి ఫెలోషిప్ అవకాశం లభిస్తుంది. ఐఐఎస్‌సీ, ఐఐఎం, ఐఎస్‌బీ, ఐఐటీ, ఎస్‍పీఏ, ఎన్ఐటీ, బిట్స్ లాంటి ప్రముఖ విద్యాసంస్థల్లో ఇటీవల డిగ్రీ పూర్తి చేసినవారు, ప్రస్తుత విద్యార్థులు ఫెలోషిప్‌కు దరఖాస్తు చేయొచ్చు. అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులూ అప్లై చేయొచ్చు లేదా ఏ సబ్జెక్ట్‌లో స్పెషలైజేషన్ ఉన్నవారైనా దరఖాస్తు చేయొచ్చు. దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్, ప్యానెల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఫెలోషిప్ మూడు నెలలు ఉంటుంది. ఫెలోషిప్‌కు ఎంపికైన వారికి మూడు రోజుల ఇండక్షన్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఫెలోస్‌కు ఫెలోషిప్ కోఆర్డినేటర్ ఉంటారు.

Jaganannafellowship 2021 Apply Process :

ఇండక్షన్ ప్రోగ్రామ్ ముగిసిన తర్వాత ఆ తర్వాత ఫెలోస్‌కు పలు డిపార్ట్‌మెంట్స్ కేటాయిస్తారు. ఫెలోషిప్ కాలంలో 30 రోజుల తర్వాత మిడ్ టర్మ్ ఎవాల్యుయేషన్, 75 రోజుల తర్వాత ఎండ్ టర్మ్ ఎవాల్యుయేషన్ ఉంటుంది. మూడు నెలల ఫెలోషిప్ ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. మూడు నెలల తర్వాత ఈ ఫెలోషిప్ ముగిస్తుంది. ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.25,000 ఫెలోషిప్ లభిస్తుంది. ఈ ఫెలోషిప్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.apssdc.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. దరఖాస్తు చేయగోరు వారు jaganannafellowship@apssdc.in మెయిల్ ఐడీకి విద్యార్థులు దరఖాస్తులు పంపాలి.

Leave a Comment