AP 10th Class Results 2023 :
బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ BSEAP 10వ తరగతి పరీక్షలను పూర్తి చేసి నేడు ఫలితాలను ప్రకటించనున్నారు. ఉదయం 11 గంటలకు ఫలితాల విడుదలకు సన్నద్ధం చేశారు. ఏప్రిల్ 03, 2023 నుండి ఏప్రిల్ 18, 2023 వరకు వివిధ పరీక్షా కేంద్రాలలో నిర్వహించారు. 2022 – 23 విద్యా సంవత్సరానికి AP బోర్డు 10వ తరగతి పరీక్షలో భారీ సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. నేడు అనగా మే 06, 2023 నెలలో అధికారిక వెబ్ పోర్టల్‌లో AP SSC బోర్డు 10వ తరగతి మార్కులు, మెమో ఫలితాలను విడుదల చేయనున్నారు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |
AP 10th Exam Results 2023 :
రాష్ట్రవ్యాప్తంగా 3449 పరీక్ష కేంద్రాలలో పదోతరగతి పరీక్షలు నిర్వహించారు. వీటిలో 682 సమస్యాత్మక కేంద్రాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అనంతపురం, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో అత్యధికంగా విద్యార్థులుండగా, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, బాపట్లలో అత్యల్పంగా ఉన్నారు. పరీక్షలను పర్యవేక్షించేందుకు, మాల్ ప్రాక్టీస్ ను నిరోధించడానికి 156 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, 682 సిట్టింగ్ స్క్వాడ్‌లతో పకడ్బందీగా ఎగ్జామ్స్ నిర్వహించారు. అదనంగా 104 పరీక్షా కేంద్రాలలో CCTV కెమెరాలు అమర్చారు.
ఉద్యోగాల సమాచారం :
- TSHC Recruitment 2023 ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు భర్తీ
- RRC SECR Recruitment 2023 రైల్వేశాఖలో మరో 548 ఖాళీలు భర్తీ
- AP Revenue Department jobs 2023 రెవెన్యూశాఖలో సాంకేతిక సహాయకుల ఉద్యోగాలు భర్తీ
- Agriculture jobs 2023 వ్యవసాయ సంస్థలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
- APSRTC Notification 2023 ఆర్టీసీలో డ్రైవర్, కండక్టర్, జూ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
AP SSC Results 2023 :
ఏపీలో 6.5 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాసినట్టు రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డి.దేవానందరెడ్డి వెల్లడించారు. ఏపీలో ఏప్రిల్ 3, 2023 నుంచి ఏప్రిల్ 18, 2023 వరకు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు నిర్వహించారు. హాల్‌టికెట్ ఆధారంగా విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పించారు, అయితే ఈ సారి ఏడు ప్రాంతీయ భాషలలో ఎగ్జామ్స్ రాశారు. ఏప్రిల్ 19 నుంచి 26 వరకు స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ పూర్తిచేశారు. మే రెండో వారంలో ఫలితాలు విడుదల చేయాలని విద్యాశాఖ భావించింది, కానీ వాల్యుయేషన్ అనుకున్న సమయానికి పూర్తి కావడంతో ఈ రోజు న టెన్త్ ఫలితాలు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
BSEAP Results 2023 :
అధికారిక వెబ్సైట్ | క్లిక్ హియర్ |
ఫలితాలు | క్లిక్ హియర్ |
డౌన్లోడ్ అవర్ యాప్ | క్లిక్ హియర్ |