నగరపాలక సంస్థలో ఉద్యోగాలు | Muncipal Jobs

Latest Muncipal Jobs :

ఆంధ్రప్రదేశ్, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో గల 20 పడకల అసుపత్రిలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా స్టాఫ్ నర్స్, ఫార్మాసిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. సొంత జిల్లాలలోనే ఉద్యోగాన్ని సాధించే అవకాశం, అదీను రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ( మెరిట్ ) ద్వారా భర్తీ చేయనున్నారు కాబట్టి ప్రతిఒక్కరు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తుతో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

AP Muncipal Corporation Recruitment

సంస్థ పేరు :
రాజమహేంద్రవరం,నగరపాలక సంస్థ
పోస్టులు : మున్సిపల్ ఆసుపత్రి నుండి విడుదలైన ఈ నోటిఫికేషన్ నందు క్రింది ఖాళీలను భర్తీ చేయనున్నారు.
స్టాఫ్ నర్స్ , ఫార్మాసిస్ట్

అర్హతలు :

విద్యార్హత : రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ నుండి వచ్చినటువంటి నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు క్రింది విద్యార్హతలు కలిగి ఉండాలి.
స్టాఫ్ నర్స్ – నర్సింగ్ విభాగంలో డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
ఫార్మాసిస్ట్ : డి ఫార్మసి పూర్తి చేసి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.
వయస్సు :
దరఖాస్తు దారులు 18 – 38 ఏళ్ల లోపు వయస్సు కలిగి ఉండాలి.
SC | ST వారికి 5 సంవత్సరాలు, BC వారికి 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పిస్తారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికయ్యేటువంటి అభ్యర్థులు సంస్థ యొక్క స్టాండడ్స్ ప్రకారం స్టాఫ్ నర్స్ కైతే రూ 12,910లు, ఫార్మాసిస్ట్ కైతే రూ10,900లు జీతం లభిస్తుంది.

దరఖాస్తు విధానం :
• అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
• అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను ‘ ఇంటర్వ్యూకు వెళ్లే సందర్భంలో బియోడేటా ఫామ్ తీసుకెళ్తే సరిపోతుంది.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి
దరఖాస్తు ఫీజు :
జనరల్ , మిగితా అభ్యర్థులు – ఎటువంటి అభ్యర్థులు లేదు.
ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ తేదీ – డిసెంబర్ 26, 2020
ఇంటర్వ్యూ ప్రదేశం – నగరపాలక కార్యాలయం, రాజమహేంద్రవరం
ఎంపిక విధానము :
అభ్యర్థులను ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన పూర్తి సమాచారం మరియు సిలబస్ కొరకు క్రింది ముఖ్యమైన లింకుల విభాగంలోని నోటిఫికేషన్ నందు పొందుపరుస్తాను, డౌన్లోడ్ చేసుకొని గమనించగలరు.
ముఖ్యమైన లింకులు : ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్ క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *