మెడికల్ షాపులో ఉద్యోగాలు భర్తీ | Medplus Pharmacy Jobs

10వ తరగతితో సొంత జిల్లాలలో ఉద్యోగాలు :

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆద్వర్యంలోని గ్రామీణ ప్రాంతాలలోని నిరుద్యోగ యువతీ మరియు యువకులకు ప్రవేటు కంపెనీలలో ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో బంపర్ అవకాశాన్ని తీసుకువచ్చింది. ఈ ప్రకటనలో భాగంగా ప్రముఖ ఫార్మా కంపెనీ అయినటువంటి మెడ్ ప్లస్ సంస్థలో ఫార్మసిస్ట్, ఫార్మసీ అసిస్టెంట్, ఫార్మసీ ఎయిడ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పురుష మరియు మహిళా అభ్యర్థులిద్దరూ పోటీ పడొచ్చు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు, అదీను ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది కాబట్టి ప్రతిఒక్కరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోండి. ఈ ఉద్యోగాన్ని పొందినట్లైతే అభ్యర్థులు తెలంగాణా లోని నల్గొండ జిల్లాలోని వివిధ ప్రాంతాలలో విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ పేరు :
మెడ్ ప్లస్,హైదరాబాద్
పోస్టులు : జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ జాబ్ మేళాలో క్రింది పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఫార్మాసిస్ట్, ఫార్మసీ అసిస్టెంట్, ఫార్మసీ అయిడ్. అర్హతలు మరియు జీతం :

పోస్టు పేరుఅర్హతజీతం
ఫార్మాసిస్ట్బీఫార్మసీ/డిఫార్మాసి/యంఫార్మసిరూ11,000వేల నుండి 14,000 ల వరకు
ఫార్మాసి అసిస్టెంట్10వ తరగతిరూ 10,000/- నుండి 12,000/- వరకు

వయస్సు :
18 – 28 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
SC / ST / BC అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పిస్తారు.
దరఖాస్తు విధానం :
> అభ్యర్థులు ఇంటర్వ్యూ సందర్భంలో ధ్రువపత్రాలను పొందుపరిస్తే చాలు.
> ఇంటర్వ్యూ ఉంటుంది
> అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
దరఖాస్తు ఫీజు :
జనరల్ అభ్యర్థులు కానీ మరియు మిగితా అభ్యర్థులు కానీ, ఎవ్వరూ కూడా ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు.
ఎంపిక విధానము :
అభ్యర్థుల ఎంపిక, ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది.
ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ ప్రారంభ తేదీ – డిసెంబర్ 09, 2020
ఇంటర్వ్యూ సమయం – ఉదయం 9 గంటల నుండి.
ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం :
టిటిడిసి మహిళా ప్రాంగణం రోడ్, రామ్ నగర్, నల్గొండా.
ముఖ్యమైన లింకులు : నోటిఫికేషన్లోని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకుల పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్క్లిక్ హియర్
అధికారిక వెబ్సైట్క్లిక్ హియర్
Medplus Pharmacy Notification Link

గమనిక :
ఈ ప్రకటనలోని ఉద్యోగాలకు సంబంధించిన జీత భత్యాలు అలానే మరింత సమాచారం కొరకు క్రింది నంబర్లకు సంప్రదించండి.
ఫోన్ నంబర్లు :
9848302573,
9848644467
సూచన : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అభ్యర్థులు మీ ప్రాంతంలోని ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందలనుకుంటున్నారా, అయితే మీ ప్రాంతం అలానే మీరు ఏ విభాగంలో ఉద్యోగం పొందలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇక ఆ బాధ్యత మేము తీసుకొని కొంత కాల వ్యవధిలో ఉద్యోగ ఖాళీలను మాత్రమే అందిస్తాము.

6 comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *