తిరుమల తిరుపతి దేవస్థాన పరిధిలో ఉద్యోగాలు భర్తీ | Telugujobalerts24

SVRR Government General Hospital Recruitment 2020 :

SVRR ( తిరుమల తిరుపతి దేవస్థాన సన్నిధిలోని, శ్రీ వెంకటేశ్వర రమానారాయణ రుయా సర్వజన ఆసుపత్రి ) లో మెడికల్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా మహిళా నర్సులు, స్టాఫ్ నర్సులు, రేడియోలాజికల్ ఫిజిసిస్టులు, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.

సొంత జిల్లాలోనే ఉద్యోగాన్ని సాధించే అవకాశం, అదీను రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ( మెరిట్ ) ద్వారా భర్తీ చేయనున్నారు కాబట్టి ప్రతిఒక్కరు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తుతో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు తిరుపతిలోని రూయా ఆసుపత్రి నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

SVRR General Hospital tirupathi recruitment

సంస్థ పేరు :
శ్రీ వెంకటేశ్వర రమానారాయణ రుయా సర్వజన ఆసుపత్రి
పోస్టులు : ఎస్వీఆర్ఆర్హెచ్ నుండి విడుదలైన మెడికల్ నోటిఫికేషన్ నందు క్రింది ఖాళీలను భర్తీ చేయనున్నారు.
మహిళా నర్సులు – 27
స్టాఫ్ నర్సులు – 02
రేడియోలాజికల్ ఫిజిసిస్టులు – 02,
ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ – 04
బ్యాక్ లాగ్ – 04

అర్హతలు :

విద్యార్హత : తిరుపతి రూయా ఆసుపత్రి నుండి విడుదలైన పోస్టులకు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు క్రింది విద్యార్హతలు కలిగి ఉండాలి.
నర్స్ :
• ఇంటర్ ఉత్తిర్ణతతో పాటు జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరి కోర్స్ పూర్తి చేసి ఉండాలి లేదా
• బియస్సి నర్సింగ్ లేదా యంయస్సి నర్సింగ్ పూర్తి చేసి ఉండాలి.
• ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్సిల్ లేదా మిడ్ వైఫ్ కౌన్సిల్ నందు గుర్తింపు తప్పనిసరి.
రేడియోలాజికల్ ఫిజిసిస్ట్ :
• ఫిజిక్స్ లేదా న్యూక్లియర్ ఫిజిక్స్ నందు యంయస్సి పూర్తి చేసి ఉండాలి.
• బాబా అటామిక్ రీసెర్చ్ సేంటర్ నుండి హాస్పిటల్ ఫిజిక్స్ లేదా రేడియోలాజికల్ ఫిజిక్స్ విభగలాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ అవసరం.
• తప్పనిసరిగా బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ వారు అందించే రేడియోలాజికల్ సేఫ్టీ ఆఫీసర్ సెర్టిఫికేట్ కలిగి ఉబడాలి.
వయస్సు :
దరఖాస్తు దారులు 18 – 42 ఏళ్ల లోపు వయస్సు కలిగి ఉండాలి.
SC | ST వారికి 5 సంవత్సరాలు, BC వారికి 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పిస్తారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికయ్యేటువంటి అభ్యర్థులు సంస్థ యొక్క స్టాండడ్స్ ప్రకారం క్రింది విధంగా జీతం లభిస్తుంది.
మహిళా నర్సింగ్ – రూ 22,500/-
స్టాఫ్ నర్సింగ్ – రూ 34,000/-
ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ – రూ 14,500/-

దరఖాస్తు విధానం :
• అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
• అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను ‘ సూపరింటెండెంట్ కార్యాలయం, ఎస్వీఆర్ఆర్ జిజిహెచ్ ఆసుపత్రి, తిరుపతి అనే చిరునామాకు ‘ చేరవేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి ఫీజు లేదు
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ – డిసెంబర్ 12, 2020
దరఖాస్తు ఆఖరు తేదీ – డిసెంబర్ 28, 2020

ఎంపిక విధానము :
అభ్యర్థులను ఎటువంటి రాత పరీక్ష లేకుండానే, కేవలం ఇంటర్వ్యూ ( మెరిట్ ) ద్వారా ఎంపిక చేస్తారు. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన పూర్తి సమాచారం మరియు సిలబస్ కొరకు క్రింది ముఖ్యమైన లింకుల విభాగంలోని నోటిఫికేషన్ నందు పొందుపరుస్తాను, డౌన్లోడ్ చేసుకొని గమనించగలరు.

ముఖ్యమైన లింకులు : ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్ & అప్లికేషన్ ఫార్మ్ క్లిక్ హియర్
అధికారిక వెబ్సైట్ క్లిక్ హియర్
SVRR Recruitment links table

సూచన : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అభ్యర్థులు మీ జిల్లాలోని ఇటువంటి ఉద్యోగ సమాచారాన్ని మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందలనుకుంటున్నారా, అయితే మీ జిల్లా పేరు ను కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇక ఆ బాధ్యత మేము తీసుకొని నోటిఫికేషన్ విడుదలైన వెంటనే మీకు తెలియజేస్తాము.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *