YVU Recruitment 2021 | నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు భర్తీ

ఆంధ్రప్రదేశ్ యోగివేమన యూనివర్సిటీ నుండి నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు :

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి చెందిన క‌డ‌ప‌లోని యోగి వేమ‌న యూనివ‌ర్సిటీ ( YVU ) లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా జూనియ‌ర్ మెడిక‌ల్ ఆఫీసర్‌, స్టాఫ్ న‌ర్సు, ల్యాబ్ టెక్నీషియ‌న్, ఫార్మ‌సిస్ట్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాంటాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

YVU Recruitment 2021

సొంత జిల్లాలలోనే ఉద్యోగం, ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి, ప్రతిఒక్కరు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తుతో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే యోగివేమన యూనివర్సిటీ పరిధిలో విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ పేరు యోగివేమన విశ్వ విద్యాలయం
ఖాళీలు 05
పోస్టులుజూనియర్ మెడికల్ ఆఫీసర్,
స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నిషియన్, ఫార్మాసిస్ట్
అర్హతజూనియ‌ర్ మెడిక‌ల్ ఆఫీసర్‌ : ఎంబీబీఎస్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. ఏపీ మెడిక‌ల్ కౌన్సిల్‌లో త‌ప్ప‌నిస‌రిగా రిజిస్ట‌ర్ అయి ఉండాలి.
స్టాఫ్ న‌ర్సు‌ : జన‌ర‌ల్ న‌ర్సింగ్ అండ్ మిడ్‌వైఫ‌రీ కోర్సు/ బీఎస్సీ(న‌ర్సింగ్‌) ఉత్తీర్ణ‌త‌. ఏపీ నర్సింగ్‌కౌన్సిల్‌లో త‌ప్ప‌నిస‌రిగా రిజిస్ట‌ర్ అయి ఉండాలి.
ల్యాబ్ టెక్నీషియ‌న్ : ఎస్ఎస్‌సీ ఉత్తీర్ణ‌త‌తో పాటు మెడిక‌ల్ ల్యాబ్ టెక్నాల‌జీలో డిప్లొమా/ మెడిక‌ల్ ల్యాబ్ టెక్నాల‌జీలో బీఎస్సీ ఉత్తీర్ణ‌త‌. ఏపీ పారామెడిక‌ల్ బోర్డులో త‌ప్ప‌నిస‌రిగా రిజిస్ట‌ర్ అయి ఉండాలి.
ఫార్మ‌సిస్ట్‌ : ఫార్మ‌సీలో డిప్లొమా/ బీఫార్మసీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం. ఫార్మా కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో త‌ప్ప‌నిస‌రిగా రిజిస్ట‌ర్ అయి ఉండాలి.
వయస్సు42 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, 
BC అభ్యర్థులకు – 5 సం లు
వయస్సులో సడలింపు
దరఖాస్తు విధానంఆఫ్ లైన్
దరఖాస్తులు పంపవలసిన చిరునామాRegistrar, Yogi Vemana University, Kadapa
దరఖాస్తు ఫీజుజనరల్ అభ్యర్థులు – రూ 300లు, మిగితా అభ్యర్థులకు ఎటువంటి
ఫీజు లేదు
దరఖాస్తు ప్రారంభ తేదీ జనవరి 19, 2021
దరఖాస్తు చివరి తేదీఫిబ్రవరి 12, 2021
ఎంపిక విధానంఇంటర్వ్యూ
ఇంటర్వ్యూ తేదీ జనవరి 18, 2021
వేతనంరూ 20,000/- లు
నోటిఫికేషన్ క్లిక్ హియర్
అఫీషియల వెబ్సైట్క్లిక్ల్ హియర్
YVU Notification 2021

సూచన : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అభ్యర్థులు మీ జిల్లాలో ఆర్టీసీ నుండి డ్రైవర్ లేదా కండక్టర్ ఉద్యోగ సమాచారాన్ని మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందలనుకుంటున్నారా, అయితే మీ జిల్లా పేరు ను కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇక ఆ బాధ్యత మేము తీసుకొని నోటిఫికేషన్ విడుదలైన వెంటనే మీకు తెలియజేస్తాము. కొంత కాల వ్యవధిలో ఉద్యోగ ఖాళీలను మాత్రమే అందిస్తాము.

4 comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *