AP Outsourcing jobs 2023 Notification అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

AP Outsourcing jobs 2023 Notification :

ఆధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ DME ఆధ్వర్యంలోని వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమశాఖ, ఏలూరు నందు ఖాళీగా గల 108 ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 18 జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టులు, 27 ఆఫీస్ సబ్ ఆర్డినెట్ పోస్టులు, 04 ల్యాబ్ అటెండెంట్ పోస్టులు, 01 ఎలక్ట్రీకల్ హెల్పర్ పోస్టు, 01 ల్యాబ్ అటెండెంట్ పోస్టు, 04 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు, 19 ల్యాబ్ అటెండెంట్ పోస్టులు మరియు తదితర పోస్టులను భర్తీ చేసున్నారు. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు మా వాట్సాప్ గ్రూపులలో చేరగలరు – వాట్సాప్ గ్రూప్

స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

AP DME Recruitment jobs 2023 :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, APDME Recruitment 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 05 సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే BC వారికి 05 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

ఆఫీస్ సబ్ ఆర్డినెట్ పోస్టులకు దరఖాస్తు చేయువారు అభ్యర్థి తప్పనిసరిగా 10వ తరగతి లేదా గుర్తింపు పొందిన బోర్డు నుండి దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ప్రథమ చికిత్స శిక్షణలో పురుషులు మాత్రమే అర్హత సాధించాలి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ 15,000/- వరకు జీతం లభిస్తుంది.

ల్యాబ్ అటెండెంట్ పోస్టులకు దరఖాస్తు చేయువారు SSC/10th లేదా దానికి సమానమైన ఉత్తీర్ణత కలిగి ఉండాలి. AP ప్రభుత్వంచే గుర్తింపు పొందిన ఏ ఇతర సంస్థ నుండి అయినా బోర్డ్ ఆఫ్ ఇంటర్ ఎడ్యుకేషన్, వారు నిర్వహించే అటెండెంట్ కోర్సు లేదా ఇంటర్మీడియట్ (ల్యాబ్ అటెండెంట్ వొకేషనల్ కోర్స్) కలిగి ఉండాలి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ 15,000/- వరకు జీతం లభిస్తుంది.

ఎలెక్ట్రిషియన్ పోస్టులకు దరఖాస్తు చేయువారు SSC ఉత్తీర్ణతతో పాటు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా లేదా ఎలక్ట్రికల్ ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. ఒక వ్యక్తి డిప్లొమా మరియు ITI సర్టిఫికేట్ రెండింటినీ కలిగి ఉంటే, కోర్సులో పొందిన మార్కుల గరిష్ట శాతం పరిగణించబడుతుంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ 22,460/- వరకు జీతం లభిస్తుంది.

మిగితా పోస్టుల పూర్తి సమాచారం క్రింది నోటిఫికేషన్నందు కలదు, పూర్తిగా చదివిన తరువాత దరఖాస్తు చేసుకోగలరు.

దరఖాస్తు లింకులు :

నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్

Leave a Comment