జిల్లా ప్రభుత్వ కార్యాలయాలలో ఉద్యోగాలు | Telugujobalerts24

ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగాలు భర్తీ :

తెలంగాణా రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ నుండి ఖాళీగా ఉన్నటువంటి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. నేషనల్ హెల్త్ మిషన్ లో భాగంగా సంగారెడ్డి జిల్లాలలోని ఆసుపత్రుల నందు వివిధ ఖాళీలను భర్తీ చేయనున్నారు. సొంత జిల్లాలోనే ఒక మంచి ఉపాధిని పొందే అవకాశం కాబట్టి జిల్లాలోని మహిళా మరియు పురుష అభ్యర్థులకు చాలా మంచి అవకాశం. 10వ తరగతి వారు, అలానే డిగ్రీ మరియు పిజి పాసైన వారందరూ ఈ పోస్టులకు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు ప్రక్రియ ప్రారంభమైంది. రాతపరీక్ష లేకుండా, కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలను కేటాయిస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే తెలంగాణాలోని సంగారెడ్డి జిల్లా నందు గల వివిధ ఆసుపత్రులలో విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

TS Medical and Health Department Recruitment

సంస్థ పేరు :
కుటుంబ మరియు వైద్య ఆరోగ్య శాఖ
పోస్టులు : ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణా, సంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖలోని క్రింది ఖాళీలను భర్తీ చేయనున్నారు.
1. ఫిజిషియన్/మెడికల్ ఆఫీసర్ – 01 పోస్టు
2. స్టాఫ్ నర్సులు – 03 పోస్టులు
3. ల్యాబ్ మేనేజర్ – 01 పోస్టు
4. రిఫ్రిజిరేటర్ మెకానిక్ – 01 పోస్టు

అర్హతలు :

విద్యార్హత : సంగారెడ్డి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఉద్యోగాలకు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు క్రింది విద్యార్హతలు కలిగి ఉండాలి.
1. ఫిజిషియన్/మెడికల్ ఆఫీసర్ – యంబిబియస్, తప్పనిసరిగా టీఎస్ మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్టర్ అయి ఉండాలి.
2. స్టాఫ్ నర్సులు – బియస్సి నర్సింగ్ పూర్తి చేసి ఉండాలి. యంయస్సి నర్సింగ్ పూర్తి చేసిన వారికి ప్రాముఖ్యత ఇస్తారు.
3. ల్యాబ్ మేనేజర్ – మైక్రో బయాలజీ లేదా బయో కెమిస్ట్రీ విభాగంలో యంయస్సి మరియు రెండు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
4. రిఫ్రిజిరేటర్ మెకానిక్ – 10వ తరగతితో పాటు సంబంధిత విభాగంలో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
వయస్సు :
దరఖాస్తు దారులు 18 – 40 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి.
SC | ST వారికి 5 సంవత్సరాలు, BC వారికి 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పిస్తారు.
జీతం :
ఈ నోటిఫికేషన్ ప్రకారం ఎంపిక కాబోయెటువంటి అభ్యర్థులు వైద్య మరియు ఆరోగ్యశాఖ ఉత్తర్వుల ప్రకారం వేతనాలు అందుకుంటారు.

దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
1. అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
2. అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
3. అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
4. అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
5. అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
6. అప్లికేషన్ మరియు తగు అర్హతల పత్రాలను ‘ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ, సంగారెడ్డి జిల్లా – 502001’ అనే చిరునామాకు చేరవేయండి.
7. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజు :
జనరల్ అభ్యర్థులు కానీ మరియు మిగితా అభ్యర్థులు కానీ, ఎవ్వరూ కూడా ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ – నవంబర్ 30, 2020
దరఖాస్తు ఆఖరు తేదీ – డిసెంబరు 10, 2020

ఎంపిక విధానము :
అభ్యర్థుల ఎంపిక, ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన పూర్తి సమాచారం మరియు సిలబస్ కొరకు ముఖ్యమైన లింకుల విభాగంలోని నోటిఫివ్లకేషన్ లో పొంఆదుపరుస్తాను డౌన్లోడ్ చేసుకొని గమనించగలరు.
ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం :
జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ, సంగారెడ్డి జిల్లా, తెలంగాణా
ముఖ్యమైన లింకులు : నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకుల పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.
అధికారిక వెబ్సైట్ : క్లిక్ హియర్
నోటిఫికేషన్ : క్లిక్ హియర్
అప్లికేషన్ పత్రము : క్లిక్ హియర్

4 thoughts on “జిల్లా ప్రభుత్వ కార్యాలయాలలో ఉద్యోగాలు | Telugujobalerts24”

Leave a Comment