India Post GDS 4th Merit List 2023 తపాలా శాఖ గ్రామీణ డాక్ సేవక్ ఫలితాలు విడుదల చేసింది

India Post GDS 4th Merit List 2023 :

తపాలా శాఖ నుండి విడుదలైన గ్రామీణ డాక్ సేవక్ GDS నోటిఫికేషన్ యొక్క నాల్గవ మెరిట్ జాబితాను పోస్టల్ శాఖ వారు ప్రకటించారు. దరఖాస్తును చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ నుండి ఫలితం మరియు మెరిట్ జాబితాను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మరి ఈ పోస్ట్‌లో మేము మెరిట్ జాబితాను, మీరు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, మెరిట్ జాబితాలో ఏ వివరాలు ఇవ్వబడతాయి అనేటువంటి వివరాల గురించి చెప్పబోతున్నాము.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
AP Govt Jobs 2023

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాతో పాటు దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో ఖాళీగా ఉన్న దాదాపు 40,889 గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్‌) పోస్టుల భర్తీకి ఇండియా నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ కింద ఆంధ్రప్రదేశ్‌లో 2480, తెలంగాణలో 1266 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు అన్ని సర్కిళ్లలలో ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైనవారి నాలుగో జాబితాను భారత తపాలా శాఖ మంగళవారం అనగా జూన్‌ 5 విడుదల చేసింది. పదో తరగతిలో సాధించిన మార్కులు మెరిట్‌ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేయడం జరుగుతుంది.

GDS 4th Merit Results :

కంప్యూటర్‌ జనరేటెడ్‌ పద్ధతిలో మెరిట్ మార్కుల ఆధారంగా ప్రాధాన్యం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అనుసరించి ఎంపిక చేసిన అభ్యర్ధుల జాబితాను విడుదల చేయడం జరిగింది. సర్టిఫికెట్ల వెరిపికేషన్ చేసిన తర్వాత తుది జాబితా విడుదల చేస్తారు. ఎంపికైనవారికి ఎస్‌ఎంఎస్‌, ఈమెయిల్‌ మరియుపోస్టు ద్వారా సమాచారం అందిస్తారు. ఎంపికైనవారు బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(BPM), అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(ABPM), డాక్‌ సేవక్‌ హోదాలతో ఆయా ప్రాంతాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. అభ్యర్థులు జూన్‌ 16వ తేదీలోగా ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది. ఆ తర్వాత అర్హులైన వారికి నియామక ఉత్తర్వులు అందజేస్తారు.

Postal GDS Results 2023 Download Process :

  • ముందుగా మీరు GDS అధికారిక వెబ్‌సైట్‌ను లేదా క్రింది ఫలితాలు అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • మీ యొక్క సర్కిల్ ను ఎంచుకుని, ఫలితాన్ని తెరవాలి.
  • ఇక్కడ విభాగాన్ని ఎంచుకోండి మరియు మెరిట్ జాబితాను డౌన్‌లోడ్ చేయండి.
  • పేరు లేదా వివరాలను పరిశీలించండి.
  • భవిష్యత్ అవసరాల కొరకు ప్రింట్ ఔట్ చేయండి.
Post Office GDS Results 2023 :
ఆంధ్రప్రదేశ్ ఫలితాలు క్లిక్ హియర్
తెలంగాణ ఫలితాలు క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
Telugujobalerts24

12 thoughts on “India Post GDS 4th Merit List 2023 తపాలా శాఖ గ్రామీణ డాక్ సేవక్ ఫలితాలు విడుదల చేసింది”

Leave a Comment