SECR Recruitment 2021 | రైల్వే శాఖ లో ఉద్యోగాలు

South East Central Railway Recruitment 2021 :

చ‌త్తీస్‌గ‌ఢ్‌ ప్ర‌ధాన కేంద్రంగా ఉన్న సౌత్ ఈస్ట్ సెంట్ర‌ల్ రైల్వే ( ఎస్ఈసీఆర్‌ ) కి చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్‌ ( ఆర్ఆర్‌సీ ) స్పోర్ట్స్ కోటా లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా బాక్సింగ్‌, క్రాస్ కంట్రీ, ఫుట్ బాల్‌, గోల్ఫ్‌, హ్యాండ్ బాల్‌, ఖో-ఖో, ప‌వ‌ర్ లిఫ్టింగ్‌, వెయిట్ లిఫ్టింగ్‌,ఆర్చ‌రీ, అథ్లెటిక్స్‌, బాస్కెట్ బాల్‌ పోస్టులను భర్తీ చేస్తున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు.

రాతపరీక్ష లేకుండా క్రీడలు, ఫిజికల్ ఫిట్ నెస్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు, కాబట్టి ప్రతిఒక్కరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా వెంటనే ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోండి. ఈ ఉద్యోగాలను పొందినట్లైతే అభ్యర్థులు ఛత్తీస్ ఘడ్ నందు విధినిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ పేరు :
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే
SECR Recruitment Vacancies Details 2021 ( పోస్టులు ) : కేంద్రప్రభుత్వ రైల్వే శాఖ ద్వారా విడుదలైనటువంటి ఈ నోటిఫికేషన్ నందు క్రింది పోస్టులను భర్తీ చేయనున్నరు.
బాక్సింగ్‌, క్రాస్ కంట్రీ, ఫుట్ బాల్‌, గోల్ఫ్‌, హ్యాండ్ బాల్‌, ఖో-ఖో, ప‌వ‌ర్ లిఫ్టింగ్‌, వెయిట్ లిఫ్టింగ్‌,ఆర్చ‌రీ, అథ్లెటిక్స్‌, బాస్కెట్ బాల్‌.

SECR Recruitment Eligibility criteria :

విద్యార్హతలు :

రైల్వే శాఖ నుండి విడుదలైనటువంటి ఈ నోటిఫికేషన్ లోని వివిధ పోస్టులకు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు పోస్టుల వారీగా క్రింది విద్యార్హతలు కలిగి ఉండాలి.
లెవ‌ల్ 2 & లెవ‌ల్ 3 : నాన్ టెక్నిక‌ల్ పోస్టులకు ఇంటర్మీడియట్, టెక్నిక‌ల్ పోస్టులకు 10వ తరగతితో పాటు ఐటీఐ ఉత్తీర్ణ‌త‌ మరియు సంబంధిత క్రీడ‌ల నందు జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వ‌హించి ఉండాలి. ఉత్తీర్ణ‌త‌.
లెవెల్ 4 & లెవెల్ 5 : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌ మరియు సంబంధిత క్రీడ‌ల నందు అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వ‌హించి ఉండాలి.


వయస్సు :

18 – 25 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
SC / STఅభ్యర్థులు – 5 సం, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పిస్తారు.

జీతం :
ఈ ప్రకటన ద్వారా అభ్యర్థులు ఎంపికయినట్లైతే రైల్వే శాఖ వారి స్టాండర్డ్స్ ప్రకారం పోస్టును అనుసరించి రూ 25,000 నుండి రూ 90,000/- వరకు వేతనం అందుకుంటారు.
దరఖాస్తు విధానం ( SECR Recruitment Apply Online )
• అభ్యర్థులు ఆన్‌లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ www.secr.indianrailways.gov.in నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.

Read Also : జిల్లా ప్రభుత్వ కార్యాలయాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు

దరఖాస్తు ఫీజు :
జనరల్ అభ్యర్థులు – రూ 500/-
మిగితా అభ్యర్థులు – రూ 250/- లు చెల్లించాలి.
ఎంపిక విధానము :
అభ్యర్థుల ఎంపిక రాతపరీక్ష లేకుండా విద్యార్హ‌త‌లు, గేమ్ స్కిల్స్‌, ఫిజిక‌ల్ ఫిట్‌నెస్‌, కోచ్ అబ్జ‌ర్వేష‌న్, క్రీడా విజ‌యాలు ఆధారంగా ఉంటుంది. ఈ ఎంపికకు సంబంధించిన పూర్తి సమాచారం క్రింది ముఖ్యమైన లింకులు సెక్షన్ లోని నోటిఫికేషన్ నందు పొందుపరిచారు, డౌన్లోడ్ చేసుకొని గమనించండి.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుకు చివరి తేదీ – ఫిబ్రవరి 23, 2021
ముఖ్యమైన లింకులు : నోటిఫికేషన్లోని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకుల పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.
నోటిఫికేషన్ : క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై : క్లిక్ హియర్ | మా యాప్ లింక్ – క్లిక్ హియర్

సూచన : ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఎటువంటి సందేహం ఉన్న క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే మీ సందేహాన్ని నివృత్తి కలిగిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అభ్యర్థులు మీ జిల్లాలోని ఉద్యోగ సమాచారాన్ని మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందలనుకుంటున్నారా, అయితే మీ జిల్లా పేరును మరియు వాట్స్ యాప్ నెంబర్ ను కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే మీ జిల్లాలో నోటిఫికేషన్ విడుదలైన వెంటనే తెలియజేస్తాము

Leave a Comment