Anganwadi Recruitment 2021 | సాంఘిక సంక్షేమ శాఖలో ఉద్యోగాలు

WDCW Telangana Anganwadi Recruitment 2021 :

తెలంగాణా రాష్ట్రప్రభుత్వం, జగిత్యాల మరియు నాగర్ కర్నూల్ జిల్లాలలో స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ప్రకటనలో భాగంగా భారీ స్థాయిలో అంగన్వాడీ కార్యకర్తలు, మినీ అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. రెగులర్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు జగిత్యాల మరియు నాగర్ కర్నూల్ జిల్లా వారు అలానే మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.

సొంత జిల్లాలోనే ఉద్యోగాన్ని సాధించే అవకాశం, అదీను ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ( మెరిట్ ) ద్వారా భర్తీ చేయనున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తుతో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు ఆయా జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింది సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ పేరు :
స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ.

Read More : జలవనరుల శాఖలో ఉద్యోగాలు

TS Anganwadi Recruitment Vacancies ( పోస్టులు ) :

అంగన్వాడీ పోస్టుల భర్తీ కొరకు విదులైన ఈ నోటిఫికేషన్ నందు క్రింది పోస్టులను భర్తీ చేయనున్నారు.
అంగన్వాడీ కార్యకర్తలు – 36 పోస్టులు, మినీ అంగన్వాడి కార్యకర్తలు – 16 పోస్టులు, ఆయాలు – 83 పోస్టులు

TS Anganwadi Recruitment Eligibility ( అర్హతలు ) :

విద్యార్హత : స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ లోని అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు క్రింది విద్యార్హతలు కలిగి ఉండాలి.
• 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి.
• తప్పనిసరిగా వివాహితై ఉండాలి.
• తప్పనిసరిగా అభ్యర్థులు స్థానికులై ఉండాలి.
వయస్సు :
దరఖాస్తు దారులు 18 – 35 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి.
SC | ST వారికి 5 సంవత్సరాలు, BC వారికి 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పిస్తారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికయ్యేటువంటి అభ్యర్థులు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వారి యొక్క స్టాండడ్స్ ప్రకారం క్రింది విధంగా జీతం లభిస్తుంది.
• అంగన్వాడీ కార్యకర్తలు – రూ 11,500/-
• మినీ అంగన్వాడీ కార్యకర్తలు,ఆయాలు – రూ 7,500/-
దరఖాస్తు విధానం :
• అభ్యర్థులు ఆన్‌లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ mis.tgwdcw.in నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి ఫీజు లేదు
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుకు ప్రారంభ తేదీ – జులై 05, 2021
దరఖాస్తుకు చివరి తేదీ – జులై 15, 2021 ఎంపిక విధానము :
అభ్యర్థులను ఎటువంటి రాత పరీక్ష లేకుండానే, కేవలం ఇంటర్వ్యూ ( మెరిట్ ) ద్వారా భర్తీ చేస్తారు. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన పూర్తి సమాచారం మరియు సిలబస్ కొరకు క్రింది ముఖ్యమైన లింకుల విభాగంలోని నోటిఫికేషన్ నందు పొందుపరుస్తాను, డౌన్లోడ్ చేసుకొని గమనించగలరు.
ముఖ్యమైన లింకులు : ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్

ఆన్ లైన్ అప్లై


సూచన : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అభ్యర్థులు మీ ప్రాంతంలోని అంగన్వాడీ పోస్టుల ఉద్యోగ సమాచారాన్ని పొందలనుకుంటున్నారా, అయితే మీ ప్రాంతం మరియు జిల్లా పేరుని కామెంట్ విభాగంలో తెలియజేసినట్లైయితే మీ ప్రాంతంలో విడుదలయ్యే ఉద్యోగ సమాచారాన్ని నోటిఫికేషన్స్ విడుదలైన వెంటనే తెలియజేస్తాము.

4 comments

    1. తప్పకుండా తెలియజేస్తాము. మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం కొరకు మా Telugujobalerts24 అనే వెబ్సైట్ ను సందర్శిస్తూ ఉండండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *