APPSC Recruitment 2023 ఏపీలో మరో 4377 ఉద్యోగాలు భర్తీ

APPSC Recruitment 2023 :

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (APPSC) గ్రూప్‌-1, గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి ఇటీవల సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గారు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో గ్రూప్‌-1 విభాగానికి సంబంధించి సుమారు 140 పోస్టులు, అలాగే గ్రూప్‌-2 విభాగానికి సంబంధించి సుమారు 1082 పోస్టులతో క‌లిపి మొత్తం 1212 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తుంది. వీలైనంత త్వరలో దీనికి సంబంధించి నోటిఫికేషన్‌ జారీచేయాలని ఆదేశించారు. నవంబర్‌ చివరి నాటికి మొత్తం నియామక ప్రక్రియను పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

[wptb id="7869" not found ]

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, ట్రిపుల్‌ ఐటీలలో ఖాళీగా గల అధ్యాపక పోస్టుల భర్తీకి కూడా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఉన్నత విద్యలో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పడంలో భాగంగా అంతర్జాతీయ స్థాయి కరిక్యులమ్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించిన నేపథ్యం, ఉత్తమ ఫలితాల సాధనకు వర్సిటీల్లో పూర్తి స్థాయిలో ఉన్నటువంటి 3295 రెగ్యులర్‌ పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించారు. దీనికి సంబంధించి ఆగస్టు 23వ తేదీన APPSC నోటిఫికేషన్‌ జారీ చేయనుంది.

APPSC Group 1 & Group 2 Vacancy 2023 :

ఖాళీల వివరాలు :

రాబోవు APPSC Notification 2023 నందు మొత్తం 4377 పోస్టులు ఉండనున్నాయి. ఇందులో 140 గ్రూప్-1 పోస్టులు, 1082 గ్రూప్-2 పోస్టులు మరియు 3295 పోస్టులు విశ్వవిద్యాలయాలు, ట్రిపుల్‌ ఐటీలలో ఖాళీగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల వారు అప్లై చేయవచ్చు.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, APPSC Recruitment 2023 నుండి విడుదల కాబోయే నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 05సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే BC వారికి 03సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • గ్రూప్-1 మరియు గ్రూప్-2 దరఖాస్తు దారులు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
  • విశ్వవిద్యాలయాలు, ట్రిపుల్‌ ఐటి దరఖాస్తు దారులు సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం :

శాఖ• APPSC
ఖాళీలు• 4377 పోస్టులు
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
జీతంపోస్టును బట్టి జీతం
మా యాప్క్లిక్ హియర్

APPSC Group 1 & Group 2 Recruitment 2023 Apply Online :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 450/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 250/-

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – ఆగస్టు 23, 2023
  • దరఖాస్తు కు చివరి తేదీ – త్వరలో తెలియజేస్తారు.

ఎంపిక ప్రక్రియ :

  • రాతపరీక్ష

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

3 thoughts on “APPSC Recruitment 2023 ఏపీలో మరో 4377 ఉద్యోగాలు భర్తీ”

  1. మీ చానల్ వ్యూస్ కోసం నిరుద్యోగుల జీవితాలతో ఆటలు ఆడకండి నోటిఫికేషన్ ఎప్పుడో తెలుసా పోని పరీక్ష విధానం ఎమిటో తెలుసా కాని నవంబర్ నాటికి నియామక ప్రక్రియ పూర్తవుతుంది అని ఎలా చెబుతున్నారు 4 సంవత్సరాల నుండి త్వరలో గ్రూప్ 2 అని చెబుతూనే ఉన్నారు

    Reply

Leave a Comment