గ్రంధాలయంలో ఉద్యోగాలు | Library Assistant Recruitment

జిల్లా గ్రంధాలయసంస్థలో ఉద్యోగాలు భర్తీ :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,తూర్పు గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఇందులో భాగంగా లైబ్రేరియన్, లైబ్రరీ హెల్పర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. సొంత జిల్లాలోనే మంచి ఉద్యోగాన్ని సాధించే అవకాశం, అదీను రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ( మెరిట్ ) ద్వారా భర్తీ చేస్తారు. సొంత జిల్లా పరిధిలో చదువుకున్న అభ్యర్థులు మాత్రమే, ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పుగోదావరి జిల్లాలోని గ్రంధాలయం నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

AP Library Assistant Recruitment 2020

సంస్థ పేరు :
గ్రంథాలయ సంస్థ
పోస్టులు : ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్, తూర్పుగోదావరి జిల్లాలోని గ్రంథాలయ సంస్థలో క్రింది పోస్టులను భర్తీ చేయనున్నారు.
లైబ్రేరియన్ – 03 పోస్టులు ( ST -W, SC – W, OC – W ),
లైబ్రరి హెల్పర్ – 01 పోస్టు ( ST – W )

అర్హతలు :

విద్యార్హత : గ్రంథాలయ సంస్థ నుండి విడుదలైన ఉద్యోగాలకు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు క్రింది విద్యార్హతలు కలిగి ఉండాలి.

పోస్టు పేరు విద్యార్హలు
లైబ్రేరియన్ ● ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
● లైబ్రరీ సైన్సు విభాగం నందు సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
● తప్పనిసరిగా కంప్యూటర్ డేటా ఎంట్రీ స్కిల్స్ కలిగి ఉండాలి.
లైబ్రరీ అసిస్టెంట్● 8వ తరగతి పాసైతే చాలు
Library Assistant Qualifications

వయస్సు :
దరఖాస్తు దారులు 18 – 35 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి.
SC | ST వారికి 5 సంవత్సరాలు, BC వారికి 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పిస్తారు.
జీతం :
ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంస్థ వారి యొక్క ఉత్తర్వుల ప్రకారం ఈ ఉద్యోగాలకు ఏమపికయ్యేటువంటి అభ్యర్థులకు పోస్టును బట్టి వేతనాన్ని కేటాయిస్తారు.

దరఖాస్తు విధానం :
• అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
• అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ మరియు తగు అర్హతల పత్రాలను ‘ సెక్రటరీ, జిల్లా గ్రంథాలయ సంస్థ, తూర్పుగోదావరి, సూపర్ మార్కెట్ ప్రక్కన, మెయిన్ రోడ్, కాకినాడ – 533001 అనే చిరునామాకు చేరవేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి ఫీజు లేదు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ – డిసెంబర్ 04, 2020
దరఖాస్తు ఆఖరు తేదీ – డిసెంబర్ 18, 2021

ఎంపిక విధానము :
అభ్యర్థుల ఎంపిక ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ( మెరిట్ ) ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన పూర్తి సమాచారం మరియు సిలబస్ కొరకు క్రింది ముఖ్యమైన లింకుల విభాగంలోని నోటిఫికేషన్ నందు పొందుపరుస్తాను, డౌన్లోడ్ చేసుకొని గమనించగలరు.
ముఖ్యమైన లింకులు : ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్ క్లిక్ హియర్
అప్లికేషన్ ఫార్మ్ క్లిక్ హియర్
అధికారిక వెబ్ సైట్ క్లిక్ హియర్

1 thought on “గ్రంధాలయంలో ఉద్యోగాలు | Library Assistant Recruitment”

Leave a Comment