కేంద్ర ప్రభుత్వ ఉపాధ్యాయ ఖాళీలు | Sainik School Recruitment

రాతపరీక్ష లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ :

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాలలో ఉపాధ్యాయ ఖాళీల కోసం ఎదురు చూసేవారికి శుభవార్త. చిత్తూరు జిల్లాలోని కలిగిరి సైనిక స్కూల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఇందులో భాగంగా బ్యాండ్ మాస్టర్, క్రాఫ్ట్ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ఈ కేంద్ర ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలకు రెండు తెలుగు రాష్ట్రాల వారు అలానే మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. సొంత జిల్లాలోనే ఉద్యోగాన్ని సాధించే అవకాశం, అదీను రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ( మెరిట్ ) ద్వారా భర్తీ చేయనున్నారు కాబట్టి ప్రతిఒక్కరు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తుతో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు చిత్తూరు జిల్లాలోని కలిగిరి సైనిక స్కూల్ నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Kaligiri Sainik School recruitment

సంస్థ పేరు :
సైనిక్ స్కూల్, కలిగిరి
పోస్టులు : కేంద్ర మానవ మరియు విద్యా వనరుల శాఖ ద్వారా విదులైన ఈ నోటిఫికేషన్ నందు క్రింది పోస్టులను భర్తీ చేయనున్నారు.
బ్యాండ్ మాస్టర్ – 01 పోస్టు
క్రాఫ్ట్ టీచర్ – 01 పోస్టు

సూచన : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అభ్యర్థులు మీ ప్రాంతంలోని ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందలనుకుంటున్నారా, అయితే మీ ప్రాంతం అలానే మీరు ఏ విభాగంలో ఉద్యోగం పొందలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇక ఆ బాధ్యత మేము తీసుకొని కొంత కాల వ్యవధిలో ఉద్యోగ ఖాళీలను మాత్రమే అందిస్తాము.

అర్హతలు :

విద్యార్హత : కలిగిరి సైనిక నందు భర్తీ చేయనున్న ఈ ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు క్రింది విద్యార్హతలు కలిగి ఉండాలి.
బ్యాండ్ మాస్టర్ :
• సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
• AEC ట్రైనింగ్ కాలేజ్ లేదా సెంటర్ నుండి బ్యాండ్ మాస్టర్/బ్యాండ్ మేజర్/డ్రమ్ మేజర్ కోర్స్ సెర్టిఫికేట్ కలిగి ఉండాలి.
• లేదా సంబంధిత విభాగంలో నావల్ లేదా ఎయిర్ ఫోర్స్ ల నందు సర్టిఫికెట్స్ పొంది ఉండాలి.
క్రాఫ్ట్ టీచర్ :
• మెట్రిక్కులేషన్ ( 10 వ తరగతి ) లేదా సమాన విద్యార్హత కలిగి ఉబడాలి.
• సంబంధిత విభాగంలో రెండు సంవత్సరాల ట్రేడ్ సెర్టిఫికేట్ కలిగి ఉండాలి.
• ఇంగ్లీష్ మీడియం నందు బోధించగల సామర్ధ్యం కలిగి ఉబడాలి.
వయస్సు :
దరఖాస్తు దారులు 21 – 50 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి.
SC | ST వారికి 5 సంవత్సరాలు, OBC వారికి 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పిస్తారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికయ్యేటువంటి అభ్యర్థులకు కేంద్ర మానవ వనరుల శాఖ మరియు సైనిక స్కూల్ వారి యొక్క స్టాండర్డ్స్ ప్రకారం బ్యాండ్ మాస్టర్ మరియు క్రాఫ్ట్ టీచర్ ఇద్దరికి రూ 26,000 ల వేతనాన్ని అందుకుంటారు.

దరఖాస్తు విధానం : • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
• అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను ‘ ద ప్రిన్సిపల్, కలిగిరి సైనిక్ స్కూల్, చిత్తూరు జిల్లా,ఆంధ్రప్రదేశ్ – 517234’ అనే చిరునామాకు చేరవేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి
దరఖాస్తు ఫీజు :
జనరల్ అభ్యర్థులు – రూ 500/- చెల్లించాలి,
మిగితా అభ్యర్థులు – రూ 200/- ప్రిన్సిపాల్, సైనిక్ స్కూల్, కలిగిరి వారి పేరు పై డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించాలి.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ – డిసెంబర్ 09, 2020
దరఖాస్తు ఆఖరు తేదీ – డిసెంబర్ 21, 2020

ఎంపిక విధానము :
అభ్యర్థుల ఎంపిక ఇంటర్వ్యూ ( డెమో ) ద్వారా చేస్తారు. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన పూర్తి సమాచారం మరియు సిలబస్ కొరకు క్రింది ముఖ్యమైన లింకుల విభాగంలోని నోటిఫికేషన్ నందు పొందుపరుస్తాను, డౌన్లోడ్ చేసుకొని గమనించగలరు.
ముఖ్యమైన లింకులు : ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్ క్లిక్ హియర్
అప్లికేషన్ ఫార్మ్ క్లిక్ హియర్
అధికారిక వెబ్ సైట్ క్లిక్ హియర్
Sainik School Online Apply

4 thoughts on “కేంద్ర ప్రభుత్వ ఉపాధ్యాయ ఖాళీలు | Sainik School Recruitment”

    • తప్పకుండా తెలియజేస్తాను.ప్రస్తుతం కలిగిరి సైనిక్ స్కూల్ లో ఖాళీలు ఉన్నాయి.

      Reply
    • అర్ధం కాలేదు.10వ తరగతి ,ఇంటర్ విద్యార్హతతో వుద్యోగాలు కావలెను,లేదా 10వ తరగతి ఇంటర్ వారికి బోధించే విధంగా కావాల్న.?

      Reply

Leave a Comment