NIAB Jobs : పశు సంవర్ధకశాఖలో ఉద్యోగాలు | 10+2 పాసైతే చాలు

కేంద్ర పశు సంవర్ధక శాఖలో ప్రభుత్వ ఆపరేటర్ ఉద్యోగాలు :

సైన్స్ మరియు బయోటెక్నాల‌జీ మంత్రిత్వ‌శాఖ పరిధిలోని హైద‌రాబాద్‌ నందు గల నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యానిమ‌ల్ బ‌యోటెక్నాల‌జీ ( NIAB ) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా ప్రాజెక్ట్ అసోసియేట్‌, ఫీల్డ్ అసిస్టెంట్‌, ప్రాజెక్ట్ అసోసియేట్‌ – 1 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్షా లేదు కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది, కాబట్టి ప్రతిఒక్కరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోండి. ఈ ఉద్యోగాన్ని పొందినట్లైతే అభ్యర్థులు హైదరాబాద్ నందు విధినిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

NIAB Recruitment

సంస్థ పేరు :
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమాల్ బయోటెక్నాలజీ
పోస్టులు : ఈ నోటిఫికేషన్ ద్వారా యన్ఐఎబి క్రింది పోస్టులను భర్తీ చేయనున్నారు.
ప్రాజెక్ట్ అసోసియేట్‌, ఫీల్డ్ అసిస్టెంట్‌, ప్రాజెక్ట్ అసోసియేట్‌-I

అర్హతలు :

విద్యార్హతలు : యానిమల్ బయేటెక్నాలజీ నోటిఫికేషన్ ద్వారా విడుదలైన ఉద్యోగాలకు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు క్రింది విద్యార్హతతో పాటు మరిన్ని అర్హతలను కలిగి ఉండాలి.
ఫీల్డ్ అసిస్టెంట్‌ : ఇంట‌ర్మీడియ‌ట్, యానిమ‌ల్ హ‌స్బెండ‌రీ / వెట‌ర్న‌రీ సైన్సుల్లో డిప్లొమా / బీఎస్సీ( అగ్రిక‌ల్చ‌ర్‌/ లైఫ్ సైన్సెస్‌ ) ఉత్తీర్ణ‌త, అనుభ‌వం మరియు ఇంగ్లిష్‌, క‌న్న‌డ, హిందీ, తెలుగు మాట్లాడ‌డం వ‌చ్చిన వారికి ప్రాధాన్య‌త ఇస్తారు.
ప్రాజెక్ట్ అసోసియేట్‌ : బిజినెస్ అడ్మినిస్ట్రేష‌న్‌లో పీజీ డిగ్రీ (ఎంబీఏ) / వెట‌ర్న‌రీ సైన్స్‌(ఎంవీఎస్సీ) / ఎమ్మెస్సీ (లైఫ్ సైన్సెస్‌ / బ‌యోటెక్నాల‌జీ / బ‌యోకెమిస్ట్రీ / మైక్రోబ‌యాల‌జీ) ఉత్తీర్ణ‌త‌.
ప్రాజెక్ట్ అసోసియేట్‌ – I : వెట‌ర్న‌రీ సైన్సులో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ(ఎంవీఎస్సీ) / ఎమ్మెస్సీ(లైఫ్ సైన్సెస్‌ / బ‌యోటెక్నాల‌జీ / బ‌యోకెమిస్ట్రీ / మైక్రోబ‌యాల‌జీ) ఉత్తీర్ణ‌త‌తో పాటు నెట్ అర్హ‌త ఉండాలి. నెట్ అర్హ‌త సాధించని అభర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.
వయస్సు :
35 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
SC / ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల వయస్సులో సడలింపు కల్పిస్తారు.
జీతం :
యన్ఐఏబి నోటిఫికేషన్ ద్వారా అభ్యర్థులు ఎంపికయినట్లైతే ఆ సంస్థ వారి స్టాండర్డ్స్ ప్రకారం రూ 30,000 వరకు వేతనం పొందుతారు.

దరఖాస్తు ప్రక్రియ :

దరఖాస్తు విధానం :
> అభ్యర్థులు మెయిల్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
> అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
> అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
> అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
> అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను ‘[email protected]’ అనే చిరునామా కు చేరవేయండి.
> భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి
దరఖాస్తు ఫీజు :
జనరల్ అభ్యర్థులు మరియు మిగితా అభ్యర్థులు ఎవ్వరికీ ఎటువంటి ఫీజు లేదు.
ఎంపిక విధానము :
అభ్యర్థుల ఎంపిక, ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన పూర్తి సమాచారం మరియు సిలబస్ కొరకు క్రింది ముఖ్యమైన లింకుల విభాగంలోని నోటిఫికేషన్ నందు అలానే వీడియో నందు పొందుపరుస్తాను, డౌన్లోడ్ చేసుకొని మరియు వీక్షించగలరు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు చివరి తేదీ – 04/01/2021
ఇంటర్వ్యూ తేదీ – 05/01/2021
ముఖ్యమైన లింకులు : ప్రకటనలోని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకుల పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.
నోటిఫికేషన్ – క్లిక్ హియర్

సూచన : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అభ్యర్థులు మీ జిల్లాలో ఆర్టీసీ నుండి డ్రైవర్ లేదా కండక్టర్ ఉద్యోగ సమాచారాన్ని మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందలనుకుంటున్నారా, అయితే మీ జిల్లా పేరు ను కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇక ఆ బాధ్యత మేము తీసుకొని నోటిఫికేషన్ విడుదలైన వెంటనే మీకు తెలియజేస్తాము. కొంత కాల వ్యవధిలో ఉద్యోగ ఖాళీలను మాత్రమే అందిస్తాము.

5 thoughts on “NIAB Jobs : పశు సంవర్ధకశాఖలో ఉద్యోగాలు | 10+2 పాసైతే చాలు”

  1. Pingback: TTD Notification | తిరుమల తిరుపతి దేవస్థాన పరిధిలో ఉద్యోగాలు - Telugu Job Alerts 24

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *