APSRTC Recruitment 2023 రాతపరీక్ష లేకుండా 1168 డ్రైవర్, కండక్టర్, ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

APSRTC Recruitment 2023 :

APSRTC ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నుండి జూనియర్ అసిస్టెంట్, కండక్టర్, ఆర్టీసీ కానిస్టేబుళ్లు, డ్రైవర్, శామ్రిక్ లేదా అసిస్టెంట్ మెకానిక్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఏపియస్ ఆర్టీసీ నందు 2016 నుంచి 2019 మధ్య సర్వీసులో చనిపోయిన ఉద్యోగుల జీవితభాగస్వామి లేదా వారసులను 1168 పోస్టులను కారుణ్య నియామకాల కింద నియమించేలా యాజమాన్యం ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
Railway jobs 2023

తొలుత కారుణ్య నియామకాలకు చెందిన దరఖాస్తులను ఆయా జిల్లాల్లోని కలెక్టర్లకు పంపి, గ్రామ, వార్డు సచివాలయాల్లోని పోస్టుల్లో నియామకాలు చేపట్టారు.
మిగిలిన దరఖాస్తులను కలెక్టర్ల నుంచి జిల్లా ప్రజా రవాణాశాఖ అధికారులు వెనక్కి తీసుకొని. వారిని RTC ల్లో ఖాళీగా గల పోస్టులలో నియమించేలా ఆదేశాలిచ్చారు. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా వివిధ రీజియన్లలో ఖాళీగా గల జూనియర్ అసిస్టెంట్, కండక్టర్, ఆర్టీసీ కానిస్టేబుళ్, డ్రైవర్, శామ్రిక్ లేదా అసిస్టెంట్ మెకానిక్ పోస్టులు కలిపి మొత్తం ఉద్యోగాల భర్తీకి ఆర్టీసీ ఎండీ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఆసక్తి గల అభ్యర్థులు పోస్టుల వారి ఖాళీలు, విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీలు, ఎలా దరఖాస్తు చేయాలి లాంటివి చదివి దరఖాస్తు చేసుకోండి.

APSRTC Latest Job Vacancy 2023 :

జూనియర్ అసిస్టెంట్లు – 34
ఆర్టీసీ కానిస్టేబుళ్లు – 146
కండక్టర్లు – 175
డ్రైవర్లు – 368
శామ్రిక్ లేదా అసిస్టెంట్ మెకానిక్లు – 445
మొత్తం ఖాళీలు – 1,168

మరిన్ని జాబ్స్ :

APSRTC Notification 2023 Eligibility :

విద్యార్హత :

  • జూనియర్‌ అసిస్టెంట్‌ – ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత
  • ఆర్టీసీ కానిస్టేబుల్ – పదో తరగతి
  • కండక్టర్‌ – పదో తరగతి
  • డ్రైవర్‌ – ఎనిమిదో తరగతి ఉత్తీర్ణతతోపాటు భారీ వాహన డ్రైవింగ్‌ లైసెన్స్ కలిగి ఉండాలి.
  • శ్రామిక్‌ – 10వ తరగతి ఉత్తీర్ణతతోపాటు ఐటీఐ అర్హతగా పేర్కొన్నారు.
  • కండక్టర్, ఆర్టీసీ కానిస్టేబుల్, డ్రైవర్‌ పోస్టులకు శారీరక ధారుడ్య పరీక్షలు కూడా ఉంటాయి.
  • ఓపెన్‌ స్కూల్‌ ద్వారా పదోతరగతి ఉత్తీర్ణులైన వారు ఉంటే, వాళ్లు చదవడం, రాయడాన్ని సెలక్షన్‌ కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. సందేహాలు ఉంటే నివృత్తి కోసం ఆ వివరాలు ఆర్టీసీ ప్రధాన కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది.

వయస్సు :

  • 30 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
  • ఒకవేళ అభ్యర్థి మరణించిన ఉద్యోగి భాగస్వామి అయితే 45 ఏళ్ల వరకు వయోపరిమితి కల్పించారు.
  • వికలాంగులు జూనియర్‌ పోస్టులకు మాత్రమే అర్హులని, మహిళా అభ్యర్థులు శ్రామిక్‌ పోస్టులకు అర్హులు కారు.
APSRTC Recruitment 2023 Apply Process :
  • అర్హతగల అభ్యర్థులు తమ డిపో మేనేజర్ గారిని సప్రదించగలరని తెలిపారు.
APSRTC Conductor Notification 2023 :
నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లినే అప్లై క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
Attender jobs 2023

4 thoughts on “APSRTC Recruitment 2023 రాతపరీక్ష లేకుండా 1168 డ్రైవర్, కండక్టర్, ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment